మొబైల్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు నిన్న(మార్చి 23) విడుదల అయ్యాయి. వన్ ప్లస్ ప్రధానంగా ఈ సారి కెమెరా, పర్ఫార్మన్స్ మీద దృష్టి సారించింది. అలాగే ఇండియా కోసం ప్రత్యేకంగా వన్ ప్లస్ 9 ఆర్ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. వన్ ప్లస్ 9 సిరీస్‌లో వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రో, వన్ ప్లస్ 9 ఆర్ ఫోన్లను తీసుకొచ్చింది. ఇప్పటివరకు కంపెనీ చేసిన టీజ్‌లతో దీనిపై అంచనాలు ఒక స్థాయికి చేరిపోయాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వన్ ప్లస్ 8కి అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా వన్ ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు లాంచ్ అయ్యాయి. వీటిలో 120 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించారు.

వన్ ప్లస్ 9 ఆర్ స్పెసిఫికేషన్లు:
- 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే
- స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్
- ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్
- ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం
- 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్
- 128 జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 48 ఎంపీ మెయిన్ కెమెరా
- 16 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
- 5 ఎంపీ మాక్రో కెమెరా
- 2 ఎంపీ మోనో క్రోమ్ కెమెరా
- సెల్ఫీ కెమెరా 16 ఎంపీ
- బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా
- వార్ప్ చార్జ్ 65టీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2 సపోర్ట్
- ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
- డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్లు
- 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.39,999
- 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.43,999
- కలర్స్: కార్బన్ బ్లాక్, లేక్ బ్ల్యూ

వన్ ప్లస్ 9 స్పెసిఫికేషన్లు:
- 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే
- స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్
- 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
- ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్
- ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం
- 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్
- 128 జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్689 సెన్సార్)
- 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా(సోనీ ఐఎంఎక్స్766)
- 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరా
- సెల్ఫీ కెమెరా 16 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్471)
- బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా
- వార్ప్ చార్జ్ 65టీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2 సపోర్ట్
- ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
- డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్లు
- 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.49,999
- 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.54,999
- కలర్స్: ఆర్కిటిక్ స్కై, యాస్ట్రల్ బ్లాక్, వింటర్ మిస్ట్

వన్ ప్లస్ 9 ప్రో స్పెసిఫికేషన్లు:
- 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ ఫ్లూయిడ్ డిస్ ప్లే
- స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్
- 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
- ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్
- ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం
- 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్
- 128 జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్789 సెన్సార్)
- 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా(సోనీ ఐఎంఎక్స్766)
- 8 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్
- 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరా
- సెల్ఫీ కెమెరా 16 ఎంపీ (సోనీ ఐఎంఎక్స్471)
- బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా
- వార్ప్ చార్జ్ 65టీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2 సపోర్ట్
- ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
- డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్లు
- 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.64,999
- 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.69,999
- కలర్స్: మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.