శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

నెట్టింట్లో వైరల్ అవుతున్న వన్‌ప్లస్‌ “క్లోవర్‌” ఫోన్ ఫీచర్స్‌

వన్ ప్లస్ అంటేనే మనలో చాలా మందికి అది ఒక ఫ్లాగ్ షిప్ మొబైల్ కంపెనీ అని మనకు గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఈ లాక్ డౌన్ కాలంలో వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లపై కాకుండా ఎంట్రీ లెవెల్ మరియు బడ్జెట్ లెవెల్ ఫోన్లపై ధృష్టి సారించింది. ఇన్ని రోజులు ఫ్లాగ్ షిప్ ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వన్ ప్లస్ ఇప్పుడు బడ్జెట్ మరియు ఎంట్రీ లెవెల్ ఫోన్ల మార్కెట్ పై పట్టు కోసం ప్రయత్నిస్తుంది. ఇది వరకే బడ్జెట్ లెవల్ లో నార్డ్, నార్డ్ లైట్ పేరుతో రెండు మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా ఎంట్రీ లెవెల్ మార్కెట్ లోకి వన్ ప్లస్ “క్లోవర్” పేరుతో వస్తున్నట్లు మెసేజ్ లు, ఫోటోలు, నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీని ధర అమెరికాలో 200 డాలర్లుగా కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. మన భారత కరెన్సీ లో సుమారు 15,000 రూపాయలు. నెట్టింట్లో వైరల్ అవుతున్న స్పెసిఫికేషన్స్ ఈ క్రింది విదంగా ఉన్నాయి.

వన్‌ప్లస్‌ క్లోవర్‌ ఫీచర్స్‌
• ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌
• క్వాల్‌కోమ్‌ స్నాప్‌ డ్రాగన్ 460 ప్రాసెసర్‌
• 6.52 అంగుళాల హెచ్‌డీ+ (720×1,560 పిక్సెల్‌) డిస్‌ప్లే
• వెనక మూడు కెమెరాలు. వాటిలో ఒకటి 13 ఎంపీ కెమెరా, రెండు 2ఎంపీ కెమెరాలు
• 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
• 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌
• సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

వన్ ప్లస్ క్లోవర్‌కి సంబంధించిన తాజా వార్త ఏమిటంటే మైస్‌ మార్ట్‌ ప్రైస్ ప్రకారం ఫోన్ యొక్క గీక్‌బెంచ్ ఫలితాలు బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 460 చిప్‌సెట్‌ను 4GB RAMతో జత చేసిన మోడల్ నంబర్ “వన్‌ప్లస్ BE2012” పేరుతో గీక్‌బెంచ్ లో పరీక్షించారు, ఫోన్ 1.80GHz వద్ద క్లాక్ చేసిన 8-కోర్ CPU ని “బెంగాల్” సంకేతనామంతో రిజిస్టర్ చేశారు. గీక్‌బెంచ్ ఫలితాలలో వన్‌ప్లస్ BE2012 సింగిల్ కోర్ పరీక్షలో 245, మల్టీ-కోర్ పరీక్షలో 1174 స్కోర్లు సాధించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu