ఒప్పో లవర్స్ కి శుభవార్త.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో(OPPO F17 Pro) బడ్జెట్ స్మార్ట్ ఫోన్

0

ఎప్పుడు కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఇతర సంస్థల కంటే ముందు ఉండే చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ఓప్పో .. ఈ సారి కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు, అలాగే శాంసంగ్, షియోమీ పోటీ దారులను తట్టుకునేందుకు అదిరిపోయే ఫీచర్స్ తో ఒప్పో F17 ప్రో (OPPO F17 Pro) అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి ఓప్పో సెప్టెంబర్ 2న విడుదల చేసింది. ఇక మొబైల్ స్పెసిఫికేషన్స్, ధర విషయానికి వస్తే ఈ క్రింది విదంగా ఉన్నాయి.

ఈ మొబైల్ లో 6.43(16.3cm) అంగుళాల డ్యూయల్ పంచ్-హోల్ ఫుల్ హెచ్ డి + సూపర్ అమోలేడ్ డిస్ప్లే ను అందిస్తుంది. దీని యొక్క యాస్పెక్ట్ రేషియో 20:9, స్క్రీన్ టూ బాడీ రేషియో 90.8 శాతంగాను ఉంది. దీనిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 10 ఒప్పో యూఐతో పని చేస్తుంది. దీనిలో ఆక్టాకోర్ మీడియా టెక్ ఆక్టాకోర్ మీడియాటెక్ హిలియో P95 (MT6779V/CV) ప్రాసెసర్ ను ఉపయోగిస్తున్నారు. దీనిలో మొత్తం 6 కెమారాలను ఉపయోగించగా.. అందులో రెండు ఫ్రంట్ కెమెరా గాను, మిగతా నాలుగు ప్రధాన కెమరాగా తీసుకొచ్చారు. ఫ్రంట్ లో సెల్ఫీ కోసం తీసుకొచ్చిన కెమెరా లో 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్(డెప్త్ కెమరా)ను వాడారు. ఇక ప్రధాన కెమెరా విషయానికి వస్తే దీనిలో 4 కెమెరాలు ఉపయోగించారు.. వీటిలో 48 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న క్వాడ్ సెన్సార్ సెటప్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, రెండు 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ అన్నీ కెమెరా లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడారు.. దీని ద్వారా మనం నాణ్యమైన ఫోటోలను పొందే అవకాశం ఉంది.

ఇది 8 జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ తో లభిస్తుంది. స్టోరేజ్ ని మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ని 512 GB వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ మొబైలు యొక్క బ్యాటరీ సామర్థ్యం 4,000 mAHగా ఉంది.. ఇది 30W VOOC ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లుగానూ, బరువు 164 గ్రాములుగానూ ఉంది. ధర విషయానికి వస్తే 22,990గా ఉంది. OPPO F17 Pro Amazon, ఒప్పో ఆన్లైన్ మరియు ఆన్‌లైన్ స్టోర్లలో కూడా లభిస్తుంది.

తాజా టెక్నాలజీ మరియు ప్రభుత్వ సేవల వార్తల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్(Instagram) మరియు యూట్యూబ్(YouTube) ఛానెల్, షేర్ చాట్(Share Chat) వంటి సామాజిక మాద్యమలను అనుసరించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here