కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రజలకు చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం నాలుగు రోజులలో మూడు రోజులు చమురు ధరలు పెరిగాయి. బ్యాంకులకు వెళ్లిన ప్రతిసారి సామాన్యుడు జోబులు తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా మరో పక్క నిత్యవసర ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు(అక్టోబర్ 1) దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది.
(చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు శుభవార్త.. ఛార్జింగ్ కష్టాలకు చెక్!)
సహజ వాయువు ధరలు పెరగడంతో ఆ ప్రభావం చమురు ధరలపై కూడా పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్టస్థాయికి చేరుకోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరల వ్యత్యాసంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక పక్క చమురు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి.
(చదవండి: ఒక్క రోజులో కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు!)
మొన్నటి వరకు జీఎస్టీ తీసుకొస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ, వారి ఆశలపై కేంద్ర, రాష్ట్రాలు నీళ్ళు చల్లాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై 25 పైసలు పెరిగి రూ.101.89కి చేరింది, డీజిల్ ధర లీటరుపై 30 పైసలు పెరిగి రూ.89.87 ఉంది.
దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
City Name | Petrol Price | Diesel Price |
హైదరాబాద్ | 106 | 99.08 |
విజయవాడ | 108.67 | 100.39 |
విశాఖపట్నం | 107.51 | 99.28 |
ఢిల్లీ | 101.89 | 89.87 |
ముంబై | 107.95 | 97.84 |
చెన్నై | 99.58 | 94.74 |
కోల్‌కతా | 102.47 | 93.27 |