PM KISAN: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లో రూ.4,000 జమ!

0
PM Kisan Samman Nidhi Yojana

PM KISAN: కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే పీఎం కిసాన్(PM KISAN) పథకం. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకు ఏడాదికి 6 రూపాయలు ఖాతాలో వేస్తుంది. అయితే ఈ డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తుంది. అంటే మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున పీఎం కిసాన్ (PM KISAN) డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.18 వేలు జమ చేసింది. ఇప్పుడు పదో విడత కింద మరో రూ.2 వేలు రానున్నాయి. డిసెంబర్ 15 కల్లా ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం.

(చదవండి: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. !)

అర్హులైన కొందరి రైతుల ఖాతాలో కొన్ని కారణాల వల్ల గత 9వ విడత నగదు జమ కాలేదు. అయితే, ఈ సారి వారి ఖాతాలో 9వ విడత రూ.2000 + 10వ విడత రూ.2000 కలిపి మొత్తం రూ.4,000 జమ చేయనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద తొలి విడత డబ్బులను ఏప్రిల్ – జూలై మధ్యకాలంలో దశల వారీగా జమ చేస్తూ వస్తుంది. అలాగే, ఆగస్ట్ – నవంబర్ మధ్య కాలంలో రెండో విడత డబ్బులు, డిసెంబర్ – మార్చి మధ్యకాలంలో మూడో విడత డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here