చిన్న చిన్న తప్పులతో రూ.2వేలు పోగొట్టుకోవద్దు!

0

ప్రధాని నరేంద్ర మోడీ 2022 నాటికి రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అందులో భాగంగానే పీఎం కిసాన్ సమ్మాన్ నీది యోజన పథకాన్ని 2019లో తీసుకొచ్చారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది 3 విడతలలో 6వేల రూపాయలను రైతు అకౌంట్లో జమ చేయనున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 7సార్లు రూ. 2వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేశారు. గత డిసెంబర్ నెల 25న 9కోట్ల మంది రైతుల ఖాతాలలో రూ.18000 కోట్లు జమ చేశారు.

ఇంకా చదవండి: పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడ్డాయా? లేదా? ఇలా తెలుసుకోండి!

అయితే కొంతమంది మాత్రం రైతులకు ఇప్పటికీ కూడా రూ.2000 జమ కాలేదు. చాలా మంది రైతుల ఖాతాలోకి డబ్బులు రావడం లేదని అధికారులు గుర్తించారు. ఆధార్ కార్డులో పేరు, చిరునామా వంటివి సరిగా లేకపోవడం ఒక కారణమైతే, పీఎం కిసాన్ కోసం ఇచ్చిన అకౌంట్ లో ఉన్న పేరు, ఆధార్ లో పేర్లలో ఉన్న చిన్న తప్పుల కారణంగా రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇటువంటి చిన్న కారణాలతో లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ కావట్లేదు. మీరు సమర్పించిన వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇస్తోంది. దీని కోసం పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/లో రైతులు తమ వివరాలను సరిచేసుకోవచ్చు.

దీని కోసం మీరు https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ వెళ్లి ఫార్మర్స్ కార్నర్‌లో ఉన్న ఎడిట్ ఆధార్ డీటైల్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. తప్పుగా సమర్పించిన వివరాలను ఇక్కడ సరిచేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీ బ్యాంక్ అకౌంట్లో తప్పులు ఉంటే మీ బ్యాంకుకు వెళ్లి వివరాలను సరిచేసుకోండి. ఇతర సమాచార కోసం మీరు హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కు కాల్ చేయవచ్చు.

మొత్తం వ్యాసం చదవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here