మోదీ అదిరిపోయే కానుక.. రైతుల అకౌంట్లలోకి ఇక రూ.10 వేలు?

0

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడం కొరకు.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఏడాది మూడు దశలలో రూ.6000 జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించేందుకు సిద్దం అవుతుంది.

ఇంకా చదవండి: ఆన్‌లైన్‌ లో ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయండి ఇలా..?

కేంద్రం ప్రభుత్వం రాబోయే బడ్జెట్ లో రైతులకు అందించే పీఎం కిసాన్ నిదులను పెంచడానికి యోచిస్తునట్లు సమాచారం. కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ నగదును రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచవచ్చు అని నివేదికలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ధర్నా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలగే కేంద్రం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యానికి ఇది కొంత చేయుతను ఇస్తుంది అని కేంద్రం భావిస్తుంది. ఒకవేల ఇదే కనుక నిజం అయితే రైతులకు కొంచెం మేలు జరగనుంది. వచ్చే నెల ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం 2021 బడ్జెట్ ను ప్రవేశ పెట్టడానికి సిద్దం అవుతుంది. కరోనా నేపథ్యంలో మోదీ సర్కార్ ఎలాంటి బడ్జెట్ తీసుకువస్తుందోనని అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here