ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందించనున్నారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనల మధ్య పీఎం-కిసాన్ నగదు సహయాన్ని పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనను ప్రకటించే అవకాశం ఉంది. వ్యవసాయ రైతుల ఆదాయ పెంపుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టమైన సందేశాలను పంపాలని చూస్తునట్లు ఉన్నత ఆర్థిక అధికారి ఒకరు తెలిపారు.(ఇది చదవండి: ఇంట్లో నుంచే క్షణాల్లో డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..?)
“పీఎం-కిసాన్ పథకం కింద ప్రస్తుత ఏడాదికి ఇస్తున్న నగదును సహాయన్ని పెంచడంతో సహా ఇతర వ్యవసాయ రంగాలకు సంబంధించి ప్రభుత్వానికి అనేక సూచనలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం విషయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ సూచనలపై ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది” అని అధికారి పేర్కొన్నారు.
పీఎం-కిసాన్ నగదు సాయం రూ.10వేలకు పెంపు
2019 ఫిబ్రవరిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన(పీఎం-కిసాన్ యోజన) పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా చిన్న, పేద రైతులందరికీ సంవత్సరానికి 6,000 రూపాయలు కనీస ఆదాయ సహాయంగా అందిస్తుంది. పిఎం-కిసాన్ పథకం కింద రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6000 చొప్పున మూడు సమాన వాయిదాలలో ప్రతి నాలుగు నెలలకు రూ.2000 చొప్పున అందిస్తుంది. ఈ రూ.2,000 మొత్తాన్ని నేరుగా రైతుల లేదా రైతుల కుటుంబాల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈ ఏడాది బడ్జెట్ లో నగదు సహాయాన్ని ఏడాదికి రూ.10,000 ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.(ఇది చదవండి: ట్రెండింగ్: ఆ టెక్నాలజీ కనిబెడితే రూ.730కోట్లు మీ సొంతం!)
వ్యవసాయ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో సగానికి పైగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక పీఎం-కిసాన్ యోజన పథకానికి గత బడ్జెట్‌లో కేటాయించింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్ లో రూ.1.42 లక్షల కోట్లు కేటాయించింది. అందులో సగానికి పైగా పీఎం-కిసాన్ యోజన పథకానికే రూ.75,000 కోట్లు కేటాయించింది. కరోనా కాలంలో కూడా పీఎం-కిసాన్ పథకం నగదును 3 వాయదాలలో రైతుల ఖాతాలో నగదును జమ చేసింది. ఈ పథకం ద్వారా జనవరి 24 నాటికి 11 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్(Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.