ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

0

Ayushman Bharat Digital Mission: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(సెప్టెంబర్ 27) ఉదయం 11గంటలకు వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ లేదా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనే పేరుతో పిలుస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డిజిటల్ మిషన్ ప్రారంభిస్తామని మాటిచ్చిన ప్రధాని, పైలట్ ప్రాజెక్టుగా 6కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు 2020 ఆగస్టు 15న ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రస్తుతం.. పైలెట్ ప్రాజెక్ట్ కింద 6 కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్- డయు, లడఖ్, లక్షద్వీప్ – పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేస్తున్నారు.

ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా దేశంలోని ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో ఒక హెల్త్ ఐడీ ఇస్తారు. ఇందులో దేశ ప్రజల పూర్తి ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారు. దేశ ప్రజలు హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ను ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ వెబ్‌ సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు.

(చదవండి: రైతులకు గుడ్ న్యూస్.. ధరణిలో మరో సదుపాయం)

ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే మీ ట్రీట్మెంట్‌ రికార్డ్‌లను పోగొట్టుకున్నా సంబంధిత సమాచారం ఈ వెబ్‌ సైట్‌లో భద్రంగా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి మీ హెల్త్‌ ఐడీ చెబితే సరిపోతుంది. డైరెక్ట్‌గా సంబంధిత ఆస్పత్రి సిబ్బంది సదరు వ్యక్తి హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ను డిజిటల్‌ రూపంలో క్షణాలలో చూసే వీలుంటుంది.

కొత్తగా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి వస్తే.. ఆ వివరాల్ని వెబ్‌ సైట్‌లో పొందుపరుస్తారు. నేషనల్‌ హెల్త్‌ అథారిటీ నిర్వహిస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌లో పౌరులతో పాటు డాక్టర్లకు సైతం కేటగిరిని ఏర్పాటు చేసింది. పౌరుల ఆరోగ్య భద్ర రిత్యా ఈ కేటగిరిలో డాక్టర్ల ఇన్ఫర్మేషన్‌తో పాటు, ఆస్పత్రులు, క్లీనిక్‌ల డేటా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here