గత కొన్ని రోజుల నుండి అంతర్జాతీయ ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ భారీనా పడుతున్న విషయం మనకు తెలిసిందే. హ్యాక్ భారీనా పడిన వారిలో అమెరికా అధ్యక్ష బరిలో నిలిబడిన జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిజినెస్ టైకూన్ ఎలాన్ మాస్క్ వంటి వారు చాలా మంది ఉన్నారు. తాజాగా నేడు ఉదయం ప్రధాని నరేంద్ర మోడి హ్యాక్ చేసినట్లు అధికారా వర్గాలు తెలిపాయి. అంతే కాదు ఈ ఖాతా ను హ్యాక్ చేసిన తర్వాత ఆ ఖాతా నుండి వరుసగా రెండు ట్వీట్లు చేశారు సైబర్ నెరగాళ్లు. వీటిలో ఒకటి “కరోనా కట్టడి కోసం అందరూ ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు క్రీప్టో కరెన్సీ రూపంలో విరాళాలు అందించండి. ఇండియాలోక్రీప్టో కరెన్సీ లావాదేవీలు ప్రారంబమయ్యాయి” అని ట్వీట్ చేయగా. రెండవ దానిలో అవును ఈ ఖాతాను జాన్ వీక్ కు చెందిన బృందం హ్యాక్ చేసింది. మీము పేటీఎం మాల్ ను హ్యాక్ చేయలేదు” అని ట్వీట్ చేశారు.
హ్యాకర్ల భారీనా పడిన ట్విట్టర్ ఖాతా narendramodi_in ప్రధాని నరేంద్ర మోడి వెబ్ సైట్ కు చెందినది తప్ప. ఇది, నరేంద్ర మోడి వ్యక్తిగత ఖాతాకు సంబంధించినది కాదు. ప్రస్తుతం ఈ ఖాతాకు 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే వెంటనే అప్రమత్తమైన ట్విట్టర్ ఇండియా ఆ ఖాతాను వారి అదినంలోకి తీసుకుంది.
Oh my god