చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాబోతోంది. పోకో ఎమ్3 విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పోకో కంపెనీ వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎమ్3ని నవంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతుంది. ఆ రోజు జరిగే లాంచ్ ఈవెంట్ లో పోకో ఎమ్3 యొక్క ధర, ఫీచర్స్ వెల్లడించనుంది. అయితే రెడ్‌మీ నోట్ 10 రీబ్రాండెడ్ వర్షన్‌ను పోకో ఎమ్3 పేరుతో తీసుకు వస్తునట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎం2 పేరుతో రీబ్రాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోకో ఎం3 విషయంలో కూడా అదే జరగొచ్చని అందరూ భావిస్తున్నారు. (చదవండి: టిక్ టాక్ లవర్స్ కి శుభవార్త)
M2010J19CG మోడల్ నంబర్ తో కొత్త POCO ఫోన్ ఈ వారం ప్రారంభంలో గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 8 ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయెల్ స్పీకర్స్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత MIUI, 4జి ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉండొచ్చని అంచనా.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.