మొబైల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదిరుచూస్తున్న పవర్ పుల్ పోకో ఎం3 మొబైల్ ఇండియాలో ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దీనికి సంబందించి ఒక వీడియోను తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ మొబైల్ కూడా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి తీసుకొని రానున్నారు. ఈ మొబైల్ ను గత ఏడాది నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశారు. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేయనుంది. దీనిలో బిగ్ 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని తీసుకొస్తున్నారు.(ఇంకా చదవండి: 50 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల డేటా హ్యాక్!)
పోకో ఎం3 ఫీచర్స్:
పోకో ఎం3 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి(1,080×2,340 పిక్సెల్స్) డిస్ప్లేతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్‌వేర్ ఆధారిత MIUI 12పైన పనిచేస్తుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పాటు 4జీబీ LPDDR4X RAM ను తీసుకొచ్చారు. ఇది 64GB, 128GB స్టోరేజ్ లలో లభిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. దీని ట్రిపుల్ కెమెరా వెనుక సెటప్‌లో 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ పొటరైట్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇందులో 8 మెగాపిక్సెల్ షూటర్ కెమెరా ఉంది.(ఇంకా చదవండి: టిక్‌టాక్‌తో సహా 58 యాప్‌లపై శాశ్వత నిషేధం?)
ఇందులో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లను అందించారు. ఫిబ్రవరి 2 ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమ్ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. గ్లోబల్ వేరియంట్ యుఎస్ ధర ప్రకారం ఫోన్ 4జీబీ+ 64జిబి స్టోరేజ్ వేరియంట్‌కు $149 (సుమారు రూ.11,000), 4జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌కు $169 (సుమారు రూ.12,500)గా ఉంది. ఇది కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.