గంటకు 16 లక్షల కి.మీల వేగంతో దూసుకొస్తున్న సౌర తుపాను

0

విశ్వంలో ఏర్పడిన ఒక శక్తివంతమైన సౌర తుపాను భూమి వైపు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. ఈ తుపాను నేడు లేదా రేపు భూమికి చేరువగా వచ్చే అవకాశం ఉంది. Spaceweather.com వెబ్ సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యుని వాతావరణం నుంచి ఉద్భవించిన ఒక సౌర తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమి స‌బ్‌-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృత‌మైన‌ట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెద‌ర్ ప్రిడిక్షన్‌ సెంటర్‌ తెలిపింది. ఉత్తర లేదా దక్షిణ ధృవం వద్ద నివసిస్తున్న ప్రజలు ఈ సౌర తుపాను కారణంగా ఆకాశంలో ఏర్పడే అందమైన ఖగోళ కాంతి దృశ్యాన్ని చూడనున్నారు.

ఈ ప్రాంతాలకు దగ్గరగా నివసిస్తున్న ప్రజలు రాత్రి పూట అందమైన అరోరా కనబడే అవకాశం ఎక్కువగా ఉంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకారం.. ఈ సౌర తుఫాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. ఇంకా రాను రాను దీని వేగం మరింత పెరగనుంది. ఈ సౌర భూమి సమీపం నుంచి వెళ్లిన భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నాసా తెలిపింది. స్పేస్ వెద‌ర్ ప్రకారం, ఈ సౌర తుఫాను కారణంగా భూమి బాహ్య వాతావరణం భారీగా వేడి చెందే అవకాశం ఉంది.

ఈ ఉష్ణోగ్రతలు ఉపగ్రహాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడం వల్ల జిపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే, విద్యుత్ సరఫరాకు కూడా ఆటంకం కలుగుతుంది. ఈ సౌర తుపాను వల్ల ట్రాన్స్ ఫార్మర్లు కూడా పేలే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీన ఈ భారీ సౌర తుఫాను గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది భూ వాతారణంపైపు చాలా వేగంగా వస్తున్నట్లు తెలిపారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here