‘స్పిరిట్‌’కు ప్రభాస్‌ రికార్డు స్థాయి పారితోషికం!

0
Hero Prabhas

తెలుగులో విజయ్ దేవరకొండా హీరోగా, సందీప్‌ రెడ్డి వంగా డైరెక్టర్‌గా వచ్చిన అర్జున్‌రెడ్డి సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయ్యిందో మనకు తెలుసు. ఆ చిత్రాన్ని బాలివుడ్‌లో షాహిద్‌ కపూర్‌తో రిమేక్‌ చేసి అక్కడ కూడా సందీప్‌ రెడ్డి వంగా పెద్ద హిట్‌ కొట్టాడు. అయితే, తాజాగా సందీప్‌ రెడ్డి డైరెక్షన్‌లోనే హీరో ప్రభాస్‌ నటించబోతున్న సంగతి తెలిసందే. ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాను టీ సిరీస్‌, సందీప్‌ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్ధ కూడా కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి.(చదవండి: క్రికెట్ ప్రియులకు ఇక పండగే పండగ.. మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్‌ లైవ్ మ్యాచ్‌లు)

భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కించున్నట్లు సమాచారం. అంతేగాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుండటం విశేషం. అయితే ఈ భారీ చిత్రానికి ప్రభాస్‌ పాన్‌ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్‌ పొందుతున్నాడని బీ టౌన్‌ లో టాక్‌. ‘స్పిరిట్‌’ సినిమా కోసం ప్రభాస్‌ ఏకంగా రూ.150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకోనున్నాడని బాలివుడ్‌ నుంచి వినిపిస్తున్న టాక్‌. బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఈ ‘స్పిరిట్‌’ సినిమాతో అత్యంత భారీ స్థాయి పారితోషికం అందుకుంటున్న స్టార్‌ హీరోగా నిలుస్తున్నాడని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here