కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం కానుంది. డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు రైతు సంఘం నాయకుడు హర్వీదర్ సింగ్ లడ్క్‌వాల్. కేంద్ర ప్రభుత్వంతో వారు జరిపే ఐదవ రౌండ్ చర్చలకు ముందు వారి నిరసనను మరింత కఠినతరం చేయడానికి ఢిల్లీకి వెళ్లే అన్ని టోల్ ప్లాజాలు మరియు రహదారులను అడ్డుకుంటామని చెప్పారు.(చదవండి: ట్రెండింగ్: పొరపాటున 42ఆర్డర్‌లు బుక్ చేసిన చిన్నారి)
రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి అవసరమైతే ఇటీవల అమలు చేసిన చట్టాన్ని సమీక్షించడానికి గురువారం కేంద్రం అంగీకరించింది. అయితే, రైతులు తమ వైఖరికి కట్టుబడి కొత్త చట్టాలకు సవరణలు కోరుకోవడం లేదని వాటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. శనివారం జరిగిన ఐదవ సమావేశంలో కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించకపోతే రైతులు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తారని రైతు నాయకుడు గుర్నమ్ సింగ్ చాడోని శుక్రవారం అన్నారు. “ఈ రోజు మా సమావేశంలో డిసెంబర్ 8న ‘భారత్ బంద్’ పిలుపునివ్వాలని నిర్ణయించుకున్నాము, ఈ సమయంలో మేము అన్ని టోల్ ప్లాజాలను కూడా ఆక్రమించుకుంటాము” అని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లఖోవాల్ అన్నారు. “కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులను మూసివేయనున్నమనీ” విలేకరుల సమావేశంలో హర్వీదర్ సింగ్ లడ్క్‌వాల్ తెలిపారు.
“నిన్న (గురువారం), వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వానికి చెప్పాము” అని ఆయన విలేకరులతో అన్నారు, రైతులు ప్రభుత్వ మరియు కార్పొరేట్ సంస్థల దిష్టిబొమ్మలను డిసెంబర్ 5న దహనం చేస్తారని, డిసెంబర్ 7న క్రీడాకారులు రైతులకు సంఘీభావంగా తమ పతకాలను తిరిగి ఇస్తారని అన్నారు. అయితే, పతకాలు తిరిగి ఇవ్వబోయే క్రీడాకారుల వివరాలను ఆయన వెల్లడించలేదు. భారత్ బంద్ పిలుపుకు అనేక ఇతర రైతు సంస్థలు మద్దతు ఇచ్చాయి. దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఆందోళన వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. రైతుల నిరసనతో కొవిడ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఓం ప్రకాశ్ పరిహార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.