2021లో ఇస్రో తొలిసారి చేపట్టిన ప్రైవేట్ వాణిజ్య (పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్) ప్రయోగం విజయవంతం అయ్యింది. మొత్తం 19 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం నాలుగు దశల్లో కోనసాగింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ51ని ప్రయోగించారు. శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభంకాగా, ఆదివారం ఉదయం 10.24కు కౌంట్‌డౌన్ జీరోకు చేరుకోగానే నింగిలోకి దూసుకు వెళ్లింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల అమెజోనియ-1 ఉపగ్రహంతో పాటు, అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు, ఐదు దేశీయ ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్ సహాయంతో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టారు. 2021ఏడాదిలో జాతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం అయ్యింది. పీఎస్‌ఎల్వీ-సీ51 ద్వారా కక్ష్యలో ప్రవేశ పెట్టిన అమెజోనియ-1 ఉపగ్రహం అనేది డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉన్న భారత ప్రభుత్వ కంపెనీ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) చేపట్టిన మొట్టమొదటి ప్రత్యేక వాణిజ్య మిషన్. NSIL స్పేస్ ఫ్లైట్ ఇంక్. అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం కింద ఈ మిషన్ ను చేపడుతోంది.
637 కిలోల అమెజానియా-1 అనేది బ్రెజిల్ యొక్క సైన్స్ మంత్రిత్వ శాఖ పరిశోధనా విభాగం అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్(INPE) రూపొందించిన ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అమెజాన్ ప్రాంతంలో అడవుల నరికివేతను పర్యవేక్షించడానికి, బ్రెజిల్ భూభాగం అంతటా వైవిధ్యభరితమైన వ్యవసాయాన్ని విశ్లేషించడానికి, వినియోగదారులకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించడానికి ఈ శాటిలైట్ తయారు చేసినట్లు బ్రెజిల్ పేర్కొంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.