గేమింగ్ ప్రియులకు శుభవార్త చెప్పింది ప్రముఖ మొబైల్ ప్రాసెసర్ తయారీ కంపెనీ క్వాల్‌కమ్. త్వరలో గేమింగ్ కోసం ఒక స్మార్ట్ ఫోన్ ని తీసుకురానునట్లు తెలిపింది క్వాల్‌కమ్. అయితే ఈ ఫోన్ ఈ ఏడాది చివరినాటికి మార్కెట్ లోకి తీసుకురవడానికి తైవాన్ మొబైల్ కంపెనీ అసుస్‌తో కలిసి ప్రణాళికలు సిద్దం చేస్తునట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ లో రాబోయే ఫీచర్ ల గురుంచి బయటికి తెలియజేయలేదు. ఈ ఫోన్ కి సంబందించిన డిజైన్ మరియు అందులో వాడే ప్రాసెసర్ ప్రాసెసర్ గురుంచి రెండు సంస్థలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఆసుస్ కంపెనీ ఇప్పటికే గేమింగ్ సంబందించిన పరికరాలను తయారు చేయడంలో మంచి పేరును సంపాదించింది. అసుస్, క్వాల్‌కమ్ కాలబోకలో గేమింగ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, గేమింగ్ కోసం షోల్డర్ బటన్స్, లేటెస్ట్ ప్రాసెసర్ ఉంటాయని టెక్ వర్గాల అంచనా. డిసెంబర్ 1 తేదీన జరిగే కార్యక్రమంలో క్వాల్‌కమ్ ఈ గేమింగ్ ఫోన్ వివరాలతో పాటు స్నాప్‌డ్రాగన్ 875, స్నాప్‌డ్రాగన్ 775జీ ప్రాసెసర్‌లను విడుదల చేయనుందని సమాచారం.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.