Multibagger: అదృష్టం అందరి వరించదు అంటే ఇదేనేమో..! కొత్తగా వచ్చిన కరోనా మహమ్మారి వల్ల స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడంతో మదుపరులకు లక్షల కోట్ల నష్టం వస్తుంది. అయితే, మరో పక్క మాత్రం అదే మార్కెట్‌లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ మాత్రం కొందరి మదుపరుల పాలిట కనకవర్షం కురిపిస్తున్నాయి. మల్టీ బ్యాగర్‌లో పెన్నీస్టాక్స్ ‘రాధే డెవలపర్స్’ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు లాభాల పంట పండుతుంది. కేవలం ఏడాదిలో వారి సంపద 3500 శాతం పెరిగింది.
(చదవండి: ఎలక్ట్రిక్ కార్లలో రికార్డు..! ఒక్కసారి ఛార్జ్‌తో 1000 కిమీ ప్రయాణం..!)
డిసెంబర్ 1,2020న ఈ స్టాక్ విలువ రూ.9.74పైసలు ఉండగా.. నవంబర్ 26 నాటికి రూ.342.20కి పెరిగింది. దీంతో ఏడాది క్రితం ఈ స్టాక్స్ లో రూ.1లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు రూ.35 లక్షలు సంపాదించారు. అలాగే, గత మూడు నెలల్లో ఈ స్టాక్స్ 1,904శాతం రాబడి రావడంతో ముదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 26,2021న ఈ స్టాక్ వ్యాల్యూ రూ.17.07 ఉండగా.. నవంబర్ 26 నాటికి రూ.342.30కి పెరిగింది. దీంతో మూడు నెలల క్రితం ఈ స్టాక్స్ లో రూ.1లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు రూ.20.04 లక్షలు సంపాదించారు.

కరోనా వేరియంట్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లు బూడిపాలయ్యాయి. అదే సమయంలో శుక్రవారం రోజు రాధే డెవలపర్స్ షేర్లు గురువారం నాడు మార్కెట్లు ముగిసే సమయానికి రూ.325.95తో పోలిస్తే 4.99% పెరిగి శుక్రవారం రోజు రూ.342.2 ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. బిఎస్‌ఈలో రాధే డెవలపర్స్ స్టాక్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.861.66 కోట్లకు పెరిగింది. మొత్తం 1.30 లక్షల షేర్లు రూ.4.44 కోట్ల టర్నోవర్‌తో చేతులు మారాయి. షేర్ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 3,603% లాభపడింది.