What is Sadabainama in Telugu: రెండూ తెలుగు రాష్ట్రాలలో భూములకు సంబందించి అనే పదాలు వాడుకలలో ఉన్నాయి. అయితే, భూములకు సంబందించిన పదాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందులో సాదాబైనామా(Sadabainama) అనేది చాలా ముఖ్యమైన పదం. అయితే, ఈ పదానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఎందుకో మనం తెలుసుకుందాం.
సాదాబైనామా(Sadabainama) అంటే ఏమిటి?
సాదాబైనామా అంటే తెల్ల కాగితంపై భూమి కొనుగోలు లేదా రిజిస్టర్ కాని క్రయ విక్రయాలను సాదాబైనామా అంటారు. రిజిస్ట్రేషన్ కానీ ఏ భూ లావాదేవీ కూడా కేవలం తెల్ల కాగితాల ద్వారా భూమి కొనుగోలు జరిగితే అది సాదాబైనామా(Sadabainama) కొనుగోలే అవుతుంది.
(Read More: ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?)
రిజిస్ట్రేషన్ కాని కొనుగోలుపై ఏదైనా పట్టా పొందాలంటే వాటిని రెగ్యులరైజేషన్ చేయించుకోవడం, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చేస్తేనే పట్టా వస్తుంది. బాండు పేపర్ మీద లేదా స్టాంపు పేపర్ మీద భూమి కొనుగోలు చేసిన లేదా వాటిని నోటరీ చేయించుకున్నా సరే అన్ రిజిస్టర్డ్(రిజిస్ట్రేషన్ కాని) కొనుగోలు కిందికే వస్తుంది.
సాదాబైనామా: సులభంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే భూ క్రయవిక్రయాల కోసం తెల్లకాగితంపై రాసుకునే ఒక ఒప్పంద పత్రమే సాదాబైనామా. ఇంకా, సెటిల్ డీడ్ మరియు సేత్వార్ అనే పదాలు చాలా ముఖ్యమైనవి.
సెటిల్ డీడ్ అంటే ఏమిటి?
విక్రయ దస్తావేజు. భూమి అమ్మకాలు, కొనుగోళ్లను ధ్రువీకరిస్తూ ఇచ్చే అధికారిక పత్రమే సెటిల్ డీడ్ అంటారు.
సేత్వార్ పహాణి అంటే ఏమిటి?
రెవెన్యూ గ్రామాలవారీగా మొదటిసారి నిర్వహించిన భూమి సర్వే వివరాలను, పట్టాదారుల వివరాలను తెలిపే రిజిష్టర్’ను సేత్వార్ పహనీ అంటారు.
గతంలో తెలంగాణ ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గ్రామాల్లో ప్రచారం చేసి అవకాశం కల్పించింది. తెల్లకాగితంపై రాసుకోకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సాగుచేసే ప్రతీ భూమికి పాస్‌బుక్కు ఉండాలన్నారు.
(ఇది కూడా చదవండి: Dharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం ఎలా..?)
రైతు బంధు, రైతు బీమా వంటి సహాయం అందాలంటే పాస్‌బుక్కు తప్పనిసరి అని మంత్రి హరీష్ రావు అన్నారు. అందుకే తెల్లకాగితంపై రాసుకున్న భూముల క్రయవిక్రయాల ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.