మొబైల్ ప్రియులకు శుభవార్త… బడ్జెట్ ధరలో మరో రెండూ రియల్ మీ స్మార్ట్ ఫోన్లు

0
real me 7 and 7 pro launched in india

బడ్జెట్ ధరలో మంచి ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా… మీకు శుభవార్త చెప్పింది రియల్ మీ. శాంసంగ్, రెడ్ మీ ఫోనులకు దీటుగా రెండు ఫోన్లను మార్కెట్ల లోకి విడుదల చేసింది. ఫోటో గ్రపీ మరియు బ్యాటరీ? నీ లక్ష్యంగా చేసుకుంటూ రియల్ మీ 7, 7ప్రో పేరుతో విడుదల చేసింది. వీటి ఫీచర్లు చూసుకుంటే ఇలా ఉన్నాయి.

రియల్ మీ 7 స్పెసిఫికేషన్లు

ఈ మొబైల్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే ను అందిస్తుంది. దీని యొక్క యాస్పెక్ట్ రేషియో 20:9, స్క్రీన్ టూ బాడీ రేషియో 90.5 శాతంగాను ఉంది. దీనిలో మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 10 రియల్ మీ యూఐతో పని చేస్తుంది. దీనిలో ఆక్టాకోర్ మీడియాటెక్ హిలియో G95 ప్రాసెసర్ ను ఉపయోగిస్తున్నారు. దీనిలో మొత్తం 5 కెమారాలను ఉపయోగించగా.. అందులో ఒకటి ఫ్రంట్ కెమెరా గాను, మిగతా నాలుగు ప్రధాన కెమరాగా తీసుకొచ్చారు. ఫ్రంట్ లో సెల్ఫీ కోసం తీసుకొచ్చిన కెమెరా లో 16 మెగా పిక్సల్ ను వాడారు. ఇక ప్రధాన కెమెరా విషయానికి వస్తే దీనిలో 4 కెమెరాలు ఉపయోగించారు.. వీటిలో 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ క్వార్టెనరీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇది 6జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, 8 జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ లలో లభిస్తుంది. స్టోరేజ్ ని మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది. ఈ మొబైలు యొక్క బ్యాటరీ సామర్థ్యం 5000 mAHగా ఉంది.. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని మందం 0.94 సెంటీమీటర్లుగానూ, బరువు 196.5 గ్రాములుగానూ ఉంది.

రియల్ మీ 7 ధర

ఇది రెండు ధరలలో లభిస్తుంది.. ప్రారంభ వేరియంట్ అయిన 6GB+ 64GB యొక్క ధర 14,999 గాను, అలాగే 8GB+128 యొక్క ధర 16,999 గాను లభిస్తున్నాయి. ఇవి సెప్టెంబర్ 10 మద్యాహ్నం 12 నుండి realme. com మరియు Flipkart లలో లభిస్తాయి.

రియల్ మీ 7ప్రొ స్పెసిఫికేషన్లు

ఈ మొబైల్ లో 6.4(16.3cm) అంగుళాల ఫుల్ హెచ్ డి + సూపర్ అమోలేడ్ డిస్ప్లే ను అందిస్తుంది. దీని యొక్క యాస్పెక్ట్ రేషియో 20:9, స్క్రీన్ టూ బాడీ రేషియో 90.8 శాతంగాను ఉంది. దీనిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 10 రియల్ మీ యూఐతో పని చేస్తుంది. దీనిలో ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720జి ప్రాసెసర్ ను ఉపయోగిస్తున్నారు. దీనిలో మొత్తం 5 కెమారాలను ఉపయోగించగా.. అందులో ఒకటి ఫ్రంట్ కెమెరా గాను, మిగతా నాలుగు ప్రధాన కెమరాగా తీసుకొచ్చారు. ఫ్రంట్ లో సెల్ఫీ కోసం తీసుకొచ్చిన కెమెరా లో 32 మెగా పిక్సల్ ను వాడారు. ఇక ప్రధాన కెమెరా విషయానికి వస్తే దీనిలో 4 కెమెరాలు ఉపయోగించారు.. వీటిలో 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ క్వార్టెనరీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇది 6జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్, 8 జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ లలో లభిస్తుంది. స్టోరేజ్ ని మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది. ఈ మొబైలు యొక్క బ్యాటరీ సామర్థ్యం 4,500 mAHగా ఉంది.. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లుగానూ, బరువు 182 గ్రాములుగానూ ఉంది.

రియల్ మీ 7 ప్రొ ధర

ఇది రెండు ధరలలో లభిస్తుంది.. ప్రారంభ వేరియంట్ అయిన 6GB+ 128GB యొక్క ధర 19 ,999 గాను, అలాగే 8GB+128 యొక్క ధర 21,999 గాను లభిస్తున్నాయి. ఇవి సెప్టెంబర్ 14 మద్యాహ్నం 12 నుండి realme. com మరియు Flipkart లలో మిర్రర్ బ్లూ, మిర్రర్ వైట్ రంగుల్లో లభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here