ఇంటర్నెట్ లో లీకైన రియల్ మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్స్

0

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ తన ఫ్లాగ్ షిప్ మొబైల్ రియల్ మీ జీటీ 5జీని మార్చి 4న చైనాలో విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఫోనే రియల్ మీ రేస్ అనే పేరుతో కూడా గతంలో వార్తల్లోకి వచ్చింది. రియల్ మీ లాంచ్ చేయనున్న మొట్టమొదటి క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఇదే కానుంది. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం రియల్ మీ జీటీ 5జీనే మనదేశంలో రియల్ మీ రేస్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ లో RMX2202 కనిపించింది.(ఇది చదవండి: విజయంతమైన ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ51 ప్రయోగం)

ఈ మొబైల్ కి సంబందించిన సమాచారం చైనా మెసేజింగ్ యాప్ వేబోలో లీకైంది. గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం దీనిలో 12జీబీ ర్యామ్ తీసుకొస్తునట్లు తెలుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇది 1.8GHz బేస్ క్లాక్ స్పీడ్ తో ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ని కూడా కలిగి ఉంది. గీక్ బెంచ్ లో రియల్ మీ జీటీ 5జీ 1,138 సింగిల్ కోర్ స్కోరు సాదిస్తే 3,572 మల్టీ కోర్ స్కోరు సాదించింది.

ఇందులో గ్లాస్, ప్లెయిన్ లెదర్ ఎడిషన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. జీటీ 5జీలో ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120హెర్ట్జ్‌గా ఉండనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ చేసే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉంది. వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here