రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

0
Redmi Note 10 pro-Max, Realme X7 5G
Redmi Note 10 pro-Max, Realme X7 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఇటీవలే తన రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్ మనదేశంలో మార్చి 18న జరిగింది. అమెజాన్, ఎంఐ.కాంలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లలో హైఎండ్ మోడల్ ఇదే. ఇందులో 108 ఎంపీ కెమెరా కూడా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.

ఇక రియల్‌ మీx7 సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఫిబ్రవరి 4న విడుదల చేసింది. రియల్‌ మీ ఎక్స్‌ 7ప్రో, రియల్‌మీ ఎక్స్‌ 7 స్మార్ట్‌ ఫక్షన్‌లను భారత్‌లో లాంచ్‌ చేసింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌ సైట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌ 7 5జీ సిరీస్‌ ఫోన్లలో సెల్ఫీ కెమెరా పంచ్‌ హూల్‌ డిస్‌ప్లే డిజైన్‌తో అందుబాటులో వస్తున్నాయి. రియల్ మీx7 5జీ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.(ఇది చదవండి: రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మొబైల్ ఫుల్ రివ్యూ, మొబైల్ కొనచ్చా?)

రెండింటిలో ఏది కొనాలి?

రెండు కూడా నెట్ ఫ్లిక్స్ వంటి వీడియొలు హెచ్ డిలో ప్లే అవుతాయి. దేనిలో డాల్బీ అట్మోస్ లేదు. డిస్ప్లే విషయనకి వస్తే రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ కొంచెం మంచిగా ఉంది. ప్రాసెసర్ పరంగా చూస్తే స్నాప్ డ్రాగన్ 732జీ కంటే మీడియాటెక్‌ డైమెన్సిటీ 800 యూ మంచి పనితీరు కనబరుస్తుంది. స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ తో పోల్చిన డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ భాగా పనిచేస్తుంది.

మీడియం గ్రాఫిక్స్ లో ఇది భాగా పనిచేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ లో ఉష్ణోగ్రత 47 వరకు వెళ్తే, రియల్ మీx7 5జీలో 43 ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాసెసర్ విషయనికి వస్తే రియల్ మీx7 5జీ మంచిగా ఉంది.

బ్యాటరీ రివ్యూ:

ఇక బ్యాటరీ విషయానికి వస్తే రియల్ మీx7 5జీ 4310 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ చార్జర్(50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో 5020 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంది. బ్యాటరీ లైఫ్ విషయంలో ‌నోట్ 10ప్రో మ్యాక్స్ లో ఎక్కువ కాలం వస్తుంది. నోట్ 10ప్రో మ్యాక్స్ ను ఫుల్ చార్జ్ చేయడానికి గంటన్నర సమయం పడితే, రియల్ మీx7 5జీ నిమిషాల సమయం పడుతుంది.

కెమెరా రివ్యూ:

రెండు మొబైల్స్ లో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. రియల్ మీx7 5జీలో వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో డెప్త్ సెన్సార్ ఉండదు. 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ కెమెరా ఉంది.

నోట్ 10ప్రో మ్యాక్స్ లో వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. రెండింటిలో మెయిన్ కెమెరాతో 30fpsలో 4కే వీడియొ, ఫ్రంట్ కెమెరా 30fpsతో 1080పీ వీడియొ, 120fpsతో 1080పీలో స్లో మోషన్ వీడియొ రికార్డు చేయవచ్చు.

కెమెరా పనితీరు విషయానికి వస్తే డే లైట్ లో భాగానే పనిచేస్తున్నాయి. నైట్ లైట్ లో కూడా రెండు భాగానే పనిచేస్తున్నాయి. ఫ్లాష్ లో తీసినప్పుడు రియల్ మీx7లో కొంచెం మంచిగా పని చేస్తుంది. వైడ్ యాంగిల్ విషయంలో రెండు ఒకే విధంగా పనిచేస్తున్నాయి. మాక్రో కెమెరా విషయంలో నోట్ 10ప్రో మ్యాక్స్ భాగా పనిచేసింది. ఫ్రంట్ కెమెరా విషయంలో రియల్ మీx7 కొంచెం మంచి పని తీరు కనబరిచింది.

రెండింటిలో అన్నీ సెన్సార్లు ఉన్నాయి. అన్నీ భాగానే పనిచేస్తున్నాయి. ఇక రియల్ మీx7 ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే, నోట్ 10ప్రో మ్యాక్స్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటే, రియల్ మీx7లో లేదు.

రియల్ మీx7లో మైక్రో ఎస్డీ సపోర్ట్ లేదు, నోట్ 10ప్రో మ్యాక్స్ లో మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంది. ఎక్కువ కాలం (2 నుంచి 4 సంవత్సరాలు) ఫోన్ వాడాలని అనుకుంటే 5జీ సపోర్ట్ ఉన్న రియల్ మీx7 తీసుకుంటే మంచిది. పెద్ద బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108 ఎంపీ కెమెరా కావాలి అనుకుంటే రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ తీసుకోవచ్చు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here