జియో ప్రీపెయిడ్ వినవయోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ తీసుకొస్తున్న రిలయన్స్ జియో సంస్థ తాజాగా పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం కూడా ఒక సరికొత్త ప్లాన్ ను ప్రకటించింది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌లో వీడియో స్ట్రీమింగ్ సేవలు మరియు జియో యాప్స్, డేటా రోల్‌ఓవర్ మరియు అంతర్జాతీయ కాలింగ్ ప్రయోజనాలకు చందాలు ఉన్నాయి. ఈ సేవల కోసం జియో చందాదారులు కొత్త సిమ్ కార్డు పొందవలసి ఉంటుంది, అయితే ఫోన్ నంబర్ అలాగే ఉంటుందని కంపెనీ తెలిపింది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సెప్టెంబర్ 24 నుండి లభిస్తుంది. రెగ్యులర్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ. 199 ప్లాన్ అలాగే కొనసాగుతుంది అని తెలిపింది.(చదవండి: వాట్సప్ లో రానున్న మరిన్ని అదిరిపోయే ఫీచర్స్)
జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ఫీచర్స్:
జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌తో, వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ + హాట్‌స్టార్ విఐపికి చందాలతో పాటు 650 కి పైగా లైవ్ టివి ఛానెల్స్, వీడియో కంటెంట్, 5 కోట్ల పాటలు మరియు 300 కి పైగా వార్తాపత్రికలతో జియో యాప్స్ కు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందుతారు. వినియోగదారులకు భారతదేశం మరియు విదేశాలలో 500GB డేటా రోల్‌ఓవర్ మరియు వై-ఫై కాలింగ్ లభిస్తుంది.
జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లలో వివిధ అంతర్జాతీయ రోమింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు విమానంలో కనెక్టివిటీ లభిస్తుంది. చందాదారులు యుఎస్ మరియు యుఎఇలలో అంతర్జాతీయ కాల్స్ ఉచితంగా చేయగలరు. ISD కాల్స్‌ని నిమిషానికి 50 పైసలు చొప్పున చెల్లించి చేసుకోవచ్చు.
జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్లు
జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్లు రూ.399 నుంచి రూ.1,499 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్ లన్నీ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు ఎస్ఎమ్ఎస్ మరియు మూడు కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీసులకు సబ్ స్క్రిప్షన్ లతో వస్తాయి. రూ.399 ప్లాన్ లో 75జీబి డేటా, 200జీబి డేటా రోల్ ఓవర్ ఉన్నాయి. రూ.599 ప్లాన్ లో 100జీబి డేటా, 200జీబి డేటా రోల్ ఓవర్, ఫ్యామిలీ ప్లాన్ తో పాటు మరో సిమ్ కార్డు కూడా ఉన్నాయి. రూ.799 ప్లాన్ లో 150జీబీ డేటా, 200జీబి డేటా రోల్ ఓవర్, ఫ్యామిలీ ప్లాన్ తో పాటు మరో రెండు అదనపు సిమ్ కార్డులను పొందవచ్చు. రూ.999 ప్లాన్ చందాదారులకు 200జిబి డేటా, 500జిబి డేటా రోల్ ఓవర్, మూడు అదనపు సిమ్ కార్డులు లభిస్తాయి. చివరగా రూ.1,499 ప్లాన్ చందాదారులకు 300జిబి డేటా, 500జిబి డేటా రోల్ ఓవర్, యూఎస్, యూఏఈలలో అపరిమిత డేటా, వాయిస్ తదితర ప్రయోజనాలు లభిస్తాయి.
జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ఎలా పొందాలి?
జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ లో చేరాలనుకునే పోస్ట్ పెయిడ్ యూజర్లు వాట్సాప్ లో ‘HI’ 8850188501కు ‘HI’ పంపాల్సి ఉంటుంది. తరువాత వారు తమ జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ సిమ్ హోమ్ డెలివరీ చేయడం కొరకు jio.com/postpaid సందర్శించాల్సి ఉంటుంది లేదా 1800 88 99 88 99కు కాల్ చేయాలి. సిమ్ పొందడం కొరకు వారు దగ్గరల్లో ఉన్న జియో స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్ ని కూడా సందర్శించవచ్చు.(చదవండి: వాట్సప్ లో రానున్న మరిన్ని అదిరిపోయే ఫీచర్స్)
జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ సెప్టెంబర్ 24 గురువారం నుంచి అందుబాటులోకి రానుంది.