కరోనా కష్టకాలంలో తమ ఉద్యోగులను ఆదుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉండేందుకు రిలయన్స్ ఒక అడుగు ముందుకేసింది. కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు 5 సంవత్సరాలు పూర్తి వేతనం ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు విద్యను అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. అలాగే ఆఫ్ రోల్స్ ఎంప్లాయిల కుటుంబాలకు పదిలక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొంది.
అలాగే బాధిత కుటుంబాలకు సాయం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా త్వరగతిన సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చింది. తాజాగా రిలయన్స్ గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో #WeappreciateReliance, #thanxReliance హ్యాష్ ట్యాగులతో రిలయన్స్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. అలాగే కోవిడ్ బారిన పడిన ఉద్యోగులు పూర్తిగా కోలుకునేంతవరకు జీతాలతో కూడిన సెలవుల్ని రిలయన్స్ మంజూరు చేసింది. (ఇది కూడా చదవండి: కరోనా: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం)
ఇంకా కరోనాతో చనిపోయిన ఉద్యోగి భార్య, తల్లి తండ్రుల, పిల్లల ఆస్పత్రి ఖర్చుల కోసం 100 శాతం ప్రీమియం చెల్లింపును రిలయన్సే భరించనున్నట్లు నిర్ణయించుకుంది. చనిపోయిన ఉద్యోగి పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు దేశంలో ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ సౌకర్యానికి అవసరమయ్యే ఖర్చులనూ రిలయన్స్ ఫౌండేషన్ భరిస్తున్నట్లు తెలిపింది.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.