రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. !

0
rythu-bandhu-scheme

Rythu Bandhu Amount: రైతులు అప్పుల ఊబిలో కురుకోకుండా పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018 వానాకాలం నుంచి ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏడాది ఎకరం భూమికి రూ.10000లను రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ నగదును ప్రతి ఏడాది రెండూ సీజన్లలో రూ.5000 చొప్పున జమ చేస్తుంది. ఈ యాసంగి సీజన్‌లోనూ రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. రైతుబంధుకు సంబంధించిన నగదును డిసెంబర్ 15వ తేదీ నుంచి రైతుల అకౌంట్లలో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

(చదవండి: గిఫ్ట్ డీడ్ భూములకు కూడా మ్యుటేషన్ చేయాలా?)

నిన్న జరిగిన టీఆర్ఎస్ ఎంపీల సమావేశంలో రైతుబంధుపై కూడా చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఈ దఫా.. సుమారు రూ.7500 కోట్లను కోటిన్నర ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. డిసెంబర్ 15వ తారీఖు లోపు నిధులు సర్దుపాటు కాకపోతే.. డిసెంబర్ చివరి వారంలో రైతుబంధు డబ్బులు విడుదల కానున్నాయి. గడిచిన వానాకాలం సీజన్‌లో మొదటి రోజు ఒక ఎకరం(One Acres) వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలు ఇలా ఆరోహణ పద్ధతిలో నగదును రైతుల ఖాతాలో జమ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here