బిగ్ బ్యాటరీతో మార్కెట్లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌పోన్

0

మనం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా శాంసంగ్ గెలాక్సీ ఎం51 మొబైల్ ఫోన్ నేడు భారత్ లో విడుదల అయ్యింది. ఈ సారి శాంసంగ్ సంస్థ భారీ బ్యాటరీ, క్వాడ్ రియర్  కెమెరా వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటూ మార్కెట్ లోకి విడుదల చేసింది. క్వాడ్ రియర్ కెమెరా, హోల్ పంచ్‌ డిస్‌ప్లే,  సైడ్ మౌంట్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్‌ నార్డ్, వివో వి 19 మోడల్స్‌తో గెలాక్సీ ఎం51 పోటీపడనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం51 యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విదంగా ఉన్నాయి.

గెలాక్సీ ఎం51 స్పెసిఫికేషన్స్:

ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్‌ యుఐ కోర్ 2.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్(Unlock 2.0 sec)ను ఉపయోగించారు. ఫేస్ ఆన్ లాక్ కి ఇది 0.77 సెకండ్ టైమ్ తీసుకుంటుంది.  

బ్యాటరీ(Battery):

ఈ ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ గురించి. 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 25 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో పాటు రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ ఫోన్‌ నుంచి మరో ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చన్నమాట. కేవలం 115 నిమిషాల్లో వంద శాతం ఛార్జ్‌ అవుతుంది. 64 గంటల టాక్ టైమ్, 24 గంటల ఇంటర్ నెట్ వాడుకోవవచ్చు, 34 గంటలు వీడియోలు చూడవచ్చు, 182 గంటల పాటు పాటలు వినవచ్చు. ఇది Type – c కి సపోర్ట్ చేస్తుంది.  

ప్రాసెసర్(Processor):

ఇందులో ఆక్టాకోర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 730జీ ఎస్ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 2.2 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 8nm మీద బిల్డ్ అయ్యింది ఇది పవర్ సేవర్ కూడా. LPDDR4 ర్యామ్ పై బిల్డ్ అయ్యింది. ఇందులో మనకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో Andreno 618 Gpu వాడటం వలన మనకు గేమింగ్ కూడా భాగా పని చేస్తుంది.

స్టోరేజ్(Storage):

ఇది 6GB+128GB, 8GB+128GB లలో మనకు లభిస్తుంది. ఎక్స్ట్రా మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించి మనం స్టోరేజ్ ని 512GB వరకు పెంచు కోవచ్చు. ఇందులో మనకు 2 సిమ్ కార్డ్ స్లాట్, ఒక స్టోరేజ్ స్లాట్ ఉంది.

డిస్‌ప్లే(Display):

ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్‌ యుఐ కోర్ 2.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌తో 6.7(16.95cm) అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీని aspect రేషియో వచ్చేసి 20: 9, Contrast Ratio 78960: 1గా ఉంది.

కెమెరా(Camera):

గెలాక్సీ ఎం51లో మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనక వైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 123 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూ 5 మెగాపిక్సెల్‌ కెమెరా, 5ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు. వెనుక వైపు వాడిన ప్రధాన 64 మెగాపిక్సెఎల్ క్వాడ్ కెమెరాలో సోనీ imx682 సెన్సర్ ఉపయోగించారు. వినియోగదారులకి మెరుగైన కెమెరా అనుభూతి కోసం సింగిల్ టేక్, వైడ్‌ యాంగిల్ ఆటో స్విచ్, స్లో మోషన్ వీడియో, ఏఐ డూడిల్, ఏఐ ఎమోజీ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి.

ధర(Price):

శాంసంగ్ గెలాక్సీ ఎం51 6జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ. 24,999 గాను, 8జీబీ ర్యామ్‌/128జీబీ అంతర్గత స్టోరేజి వేరియంట్ ధర రూ. 26,999గా సంస్థ నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి వీటి అమ్మకాలు అమెజాన్‌, శాంసంగ్ వెబ్‌సైట్‌ లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ప్రారంభం కానున్నాయి. ఎలక్ట్రిక్‌ బ్లూ, సెలెస్టియల్ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here