చాలా కాలం నుండి శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ స్పెసిఫికేషన్స్, విడుదలపై అనేక రూమర్స్ వస్తున్నాయి. 2021 జనవరి ప్రారంభంలో దీనిని తీసుకురానున్నారని సమాచారం. తాజాగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ మొబైల్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధరలను జర్మన్ పబ్లిషర్ విన్ ఫ్యూచర్ లీక్ చేసింది. ఈ లీక్స్ ప్రకారం, ట్రీపుల్ రియర్ కెమెరాలు, సింగిల్ సెల్ఫీ షూటర్ కెమెరా, 8 జీబీ ర్యామ్ ఉన్నాయి. రాబోయే మొబైల్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా సామ్‌సంగ్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ తో జనవరి 12న అధికారికంగా లాంచ్ కానుంది. గెలాక్సీ ఎస్ 21 సిరీస్ జనవరి 14న లాంచ్ కానుంది.
ఇంకా చదవండి: కొత్త ఏడాదిలో పెరగనున్న టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు!
ఎస్ 21 ఫీచర్స్:
వనిల్లా గెలాక్సీ ఎస్ 21 మొబైల్ 6.2-అంగుళాల పూర్తి-హెచ్‌డి ఇన్ఫినిటీ ఓ డైనమిక్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో రానుంది. గెలాక్సీ ఎస్ 21 మొబైల్ ఎక్సినోస్ 2100 (యూరప్‌లో) లేదా స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ (యుఎస్‌లో)తో పని చేయనుంది. ఇది 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో రానుంది. వరకు అంతర్గత నిల్వను ప్యాక్ చేయాలని భావిస్తున్నారు. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 3x హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీ కోసం 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ పరంగా, గెలాక్సీ ఎస్ 21 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికి సపోర్ట్ చేయవచ్చు. కనెక్టివీటి కోసం బ్లూటూత్ వీ5, యుఎస్బీ టైప్ సి పోర్ట్, ఎన్ఎఫ్సి, వై-ఫై 6 ఉన్నాయి.
ఎస్ 21 ప్లస్ ఫీచర్స్:
మరోవైపు, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డి ఇన్ఫినిటీ-ఓ అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. ఇది 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. దీని కెమెరా ఫీచర్లు గెలాక్సీ ఎస్ 21 మాదిరిగానే ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి శామ్‌సంగ్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ లేదా స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానుంది. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1తో అవుట్-ఆఫ్-ధీ-బాక్స్‌తో వస్తుంది. ధరల విషయానికొస్తే రెగ్యులర్ మోడల్ ధర ఐరోపాలో యూరోలు 849 (సుమారు రూ.76,800), ప్లస్ వేరియంట్ బేస్ 128జీబీ ర్యామ్ వేరియంట్ వెర్షన్ కోసం యూరోలు 1,049 (సుమారు రూ.95,000) వద్ద లభించనుందని నివేదికలో పేర్కొంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.