గెలాక్సీ ఎస్‌21 ప్రీ ఆర్డర్ల-బుకింగ్‌ ప్రారంభం.. 4వేల ఫోన్‌ కవర్‌ ఫ్రీ

0

టెక్ దిగ్గజం శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 మొబైల్ సిరీస్ ను జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ఇప్పుడు భారతదేశంలో ఓపెన్ చేశారు. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.2 వేల రూపాయలు చెల్లించి రాబోయే స్మార్ట్‌ఫోన్లను ప్రీ-బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ప్రీ ఆర్డర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు 3,849 రూపాయలు విలువైన ఒక ఫ్రీ కవర్ లభిస్తుందని పేర్కొంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21అల్ట్రాను ముందస్తు ఆర్డర్ చేసిన వారికి గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్, గెలాక్సీ బడ్స్ ప్రో ఉచితంగా లభిస్తాయి. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను గెలాక్సీ అన్ప్యాక్డ్ 2021 పేరుతో జనవరి 14న రాత్రి 8 గంటలకు లాంచ్ చేయనున్నారు.(చదవండి: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబందనలు వారికి మాత్రమే..?)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here