మహిళా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఎస్‌ఏపీ ఇండియా, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. “టెక్‌సాక్షం” పేరుతో 62,000 మందికి పైగా ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాలలో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. నిపుణులైన 1,000 మందికి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్‌షిప్స్, చిన్న వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రాష్ట్రాల విద్యాశాఖలు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సాయంతో 1,500 మంది టీచర్లకు సైతం శిక్షణ ఇస్తారు.
శిక్షణ పొందిన ప్రతి టీచర్ ఒక ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా ఒక ఏడాది కాలంలో 60,000-75,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. సైన్సెస్, ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్ గ్రాడ్యుయేట్ అయిన యువతులకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను నేర్పించాలని ఎడునెట్ ఫౌండేషన్ ఈ పాన్-ఇండియా చొరవను తీసుకుంది. ఎఐసీటీఈ చైర్మన్ అనిల్ డి సహస్రబుధే మాట్లాడుతూ టెక్ సాక్షమ్.. ”శిక్షణ పొందే 60,000 మందికి పైగా మహిళలు వ్యవస్థలో భారీ ప్రభావాన్ని చూపుతారు. అంతేగాక, 1500 మందికి మహిళ టీచర్ల సహాయంతో మహిళ గ్రాడ్యుయేట్లు ఉపాధి పొందడం మాత్రమే కాకుండా, వారి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించడానికి చాలా మంది విద్యార్థులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది” అని ఆయన అన్నారు.