100W ఫాస్ట్ వైర్‌లెస్ టెక్నాలజీతో రానున్న స్మార్ట్ ఫోన్లు.. ఎప్పుడంటే?

0

రోజు రోజుకి మొబైల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్‌ ఫోన్ తయారీ కంపెనీలు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్‌తో ఛార్జర్లను తీసుకొస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం, వన్‌ప్లస్ తీసుకొచ్చిన ’30W డాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌లో ఫాస్టెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీగా అప్పుడు పరిగణించారు. ఇప్పుడు, 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఉన్న ఫోన్లు ఉన్నాయి. దానితో పాటు షావోమి 55 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చింది. తాజాగా క్వాల్‌కోమ్‌ క్విక్‌ ఛార్జ్‌ 5.0 పేరుతో 100 వాట్ ఫాస్ట్‌ వైర్‌ ఛార్జింగ్‌ను 2021లో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే, దీనితో పాటు 100 వాట్ ఫాస్ట్ వైర్‌లెస్ కూడా ఛార్జింగ్ 2021లో అందుబాటులోకి రావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.(చదవండి: యూజర్ల కోసం సరికొత్త అప్ డేట్ తీసుకొచ్చిన పేటీఎం)

ఒప్పో ఏస్ 2 మరియు హువావే పి 40 ప్రో ప్లస్‌లలో 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ ఫోన్లను తీసుకొచ్చాయి. ఒప్పో తన 65W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తునట్లు ప్రకటించిన, దీనికి సంబందించిన మొబైల్ ని ఇంకా మార్కెట్ లో విడుదల చేయలేదు. ఇదే తరహాలో ఒప్పో, షావోమి కంపెనీలు 100 వాట్ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని తీసుకొచ్చే పనిలో ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్‌లెస్‌ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో చార్జింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ 100 వాట్ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ విడుదలయితే కేవలం నిమిషాల వ్యవధిలో ఫోన్‌ బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here