రైతులకు ఎస్​బీఐ శుభవార్త.. తక్కువ వడ్డీకే రుణాలు!

0
SBI-Agri-GOld-Loan

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) రైతులకు శుభవార్త అందించింది. రైతులకు తక్కువ వడ్డీకే అగ్రి గోల్డ్ రుణాలను అందిస్తున్నట్లు ఎస్​బీఐ తెలిపింది. ఈ వియాన్ని ఎస్‌బీఐ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. ఎస్​బీఐ అగ్రి గోల్డ్ రుణాల పేరుతో తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7 శాతం నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల వ్యక్తులు ఎస్​బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని తీసుకోవచ్చు.

(చదవండి: పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ-కేవైసి చేయకపోతే రూ.2 వేలు రానట్లే..!)

ఈ ఎస్‌బీఐ అగ్రి గోల్డ్ రుణం మాత్రం కేవలం బంగారు నగలపై మాత్రమే లభిస్తున్నట్లు. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు అందిస్తుంది. కానీ గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు లభించవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఎస్‌బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటివి చేస్తున్న వారికి కూడా ఈ రుణాలు వస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here