ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు, వ్యక్తుల జీతం, సెలబ్రిటీల సంపాదన గురించి సాదారణ ప్రజల్లో ఒకరకమైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు కథనాలు, యూట్యూబ్ థంబ్ నైల్ లో ‘ఫలానా వాళ్లు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు?’ లాంటి పెట్టె హెడ్డింగ్‌లకు దక్కే ఆదరణే అందుకు ఉదాహరణ. అయితే తమ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి వాళ్లు బహిరంగంగా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది దేశ రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ తన జీతం, కట్టింగ్‌ల గురించి మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఓ న్యూస్ ఛానెల్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురించి షేర్ చేసిన ట్విటర్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రామ్‌నాథ్ కోవింద్ ఇలా మాట్లాడారు.. ‘‘ దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న వ్యక్తి నేను. నా నెల సంపాదన రూ. 5 లక్షలు అయినప్పటికీ అందులో 3 లక్షల దాకా ట్యాక్స్, కట్టింగ్‌ల రూపంలోనే పోతున్నాయి. ఆ లెక్కన చూస్తే నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం ఉత్తమం కాదు. ఒక టీచర్, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నాకంటే ఎక్కువే పొదుపు చేస్తున్నారు’’ అంటూ సరదాగా నవ్వుతూ ఆయన అన్నారు.
ఈ వీడియోపై నానారకలుగా కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్ కట్టింగ్‌లు ఉండవని, ఆ విషయం తెలియక ఆయన అలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని కొందరు ట్విటర్ ద్వారా హేళన చేస్తున్నారు. పైగా పోస్ట్ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఇతరత్రా అలవెన్స్‌లు కూడా ఉంటాయని వారు గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు.
పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని వారు చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్‌లు ఉంటాయని మరికొందరు వాదిస్తున్నారు. ఇంకొందరేమో మరి ఆ ట్యాక్స్ కట్టింగ్‌ల జీతం ఎటుపోతుందోనని ఇంటర్నెట్ ద్వారా ఆరా తీస్తున్నారు. ఈ వివాదం ఎటు నుంచి ఎటో వెళ్లి.. రాజకీయ దుమారానికి తెరలేపింది.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.