ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు బడ్జెట్ తర్వాత భారీ షాక్ ఇచ్చింది కేంద్రం. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఎల్‌పిజి రేట్లను పెంచాయి. దీంతో వంట గ్యాస్ సిలిండర్లు, వాణిజ్య సిలిండర్ల ధరలు పెరుగుతున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 రూపాయలు వరకు పెరిగింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెరిగినప్పటికీ, వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధర రూ.6 వరకు తగ్గింది. 19 కిలోల బరువున్న ఈ సిలిండర్లు రూ.1572కు బదులుగా రూ.1566 కు కొనుగోలు చేయవచ్చు.(ఇది చదవండి: రేషన్ కార్డు కోసం ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింకు చేయండి ఇలా..?)
ఫిబ్రవరి 1న వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ.190 రూపాయల వరకు పెంచారు. అయితే, ఆ రోజు దేశీయ వంట గ్యాస్ సిలిండర్ల రేటులో ఎటువంటి మార్పు లేదు. గత డిసెంబర్‌లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రెండుసార్లు పెరిగింది. రెండు సార్లు కూడా 14 కిలోల సిలిండర్ ధరలో రూ.50 రూపాయల వరకు పెంపు ఉంది. రేట్ల పెంపు నిర్ణయంతో ప్రస్తుతం న్యూఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.719కు చేరింది. ఇదివరకు ఈ రేటు రూ.694గా ఉంది. మన హైదరాబాద్‌లో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.746 నుంచి రూ.771.5కు పెరిగింది. ఏపీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.777కు పెరిగింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2021-22 బడ్జెట్‌లో పెట్రోలియం సబ్సిడీ విషయంలో కోత విధించారు. 2020-21కి గాను ఇంధనాలపై రూ.40,915 కోట్ల మేరకు సబ్సిడీ ఇవ్వగా, తాజా బడ్జెట్‌లో దాన్ని రూ.12,995 కోట్లకు తగ్గించింది. అంటే దాదాపుగా 66 శాతం మేర కోత పడింది. పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీలకు కోత విధించడంతో.. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు భవిష్యత్ లో ఇంకా పెరగనున్నాయి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.