చాలా వరకు కంపెనీ యజమానులు తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాన్ని గుర్తించక పొగ వారిని అవమానిస్తారు. మరి కొంత యజమానులు ఉద్యోగులు కష్టాన్ని గుర్తిస్తూ పండుగ సమయాల్లో ఉద్యోగులకు ఎంత కొంత బోనస్ రూపంలో సహాయం చేస్తూ ఉంటారు. ఇక మూడవ రకం యజమానులు మాత్రం వారి ఉద్యోగులకు కష్ట సుఖలలో తోడుగా ఉంటారు. ఇలాంటి మూడవ రకం యాజమనులు ప్రపంచం మొత్తం మీద 0.01% లోపు ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే యజమాని కూడా ఈ మూడవ రకానికి చెందిన వాడు. సూరత్‌లో ఉన్న అలియన్స్ సంస్థ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. కంపెనీ ఎదుగుదలకు తోడ్పాటు అందించిన ఉద్యోగులకు ఏదైనా చేయాలని ఆ కంపెనీ యజమాని భావించాడు. సరిగ్గా అదే సమయంలో గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లను బహుమతిగా ఇవ్వాలని ఆలోచించాడు. దీపావళి పండుగని అందుకు తగిన సందర్భంగా ఎంచుకున్నాడు.

తమ ఆఫీసుకు వచ్చి పోయే ఉద్యోగులకు సౌకర్యంగా ఉండటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక్కో ఉద్యోగికి ఓకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని పండగ గిఫ్ట్‌గా అందించాడు. ఒక్క స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ.76,848లుగా ఉంది. మొత్తం సంస్థలో ఉన్న ముప్రై ఐదు మందికి ఈ స్కూటర్లను అందించాడు. 2 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఓకినావా స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 88 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గరిష్ట వేగం గంటకు 58 కి.మీలు. ఒకసారి ఛార్జ్ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది.