సుజుకీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 90 కి.మీ. ప్రయాణం

0

Suzuki Burgman Electric Scooter: మండుతున్న పెట్రో ధరల కారణంగా తక్కువ ధరలో మంచి నాణ్యత గల ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్నారా? స్టైలిష్ లుక్ లో గల ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా?. అయితే, ఒకసారి మేము చెప్పే దాని గురుంచి పూర్తిగా చదవండి. మనం తెలుసుకోబోయేది స్కూటరే అయినా దానిలో బైక్ రేంజ్‌లో ఫీచర్లు ఉన్నాయి. మన దేశానికి చెందిన ప్రజలకు ఎక్కువ శాతం జపాన్‌లో తయారయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులంటే బాగా ఇష్టం. ఎందుకంటే మంచి క్వాలిటీతో పాటు ధర కూడా అందుబాటులో ఉంటుందని నమ్ముతారు. అందుకే జపాన్ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీని భారతీయులు విపరీతంగా ఆదరిస్తున్నారు.

తాజాగా ఈ కంపెనీ బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో లాంచ్ చేయబోతోంది. క్వాలిటీ వాహనాలు తయారుచేస్తుందనే మంచి పేరు సుజుకీకి ఉంది. సర్వీస్ విషయంలోనూ కస్టమర్ల నుంచి పాజిటివ్ పాయింట్లు పొందుతోంది. అందుకే ఈ స్కూటర్‌ని అన్ని రకాల టెస్టులూ చేశాకే విడుదల చెయ్యాలని నిర్ణయించింది. ఈ మధ్యే ఈ స్కూటర్‌కి అన్నీ టెస్టులు పూర్తయ్యాయి. ఈ పరీక్షలో ఈ స్కూటర్ మంచి ఫలితాలు సాధించింది. ఒక ప్రముఖ వెబ్‌సైట్ రిపోర్ట్ ప్రకారం.. ఈ స్కూటర్ 5 రంగుల్లో విడుదల కానుంది. ఈ స్కూటర్ లో టైల్‌పైప్ ఎమిషన్ ఉండదు. దీనికి స్వింగ్ ఆర్మ్-మౌంటెడ్ రియర్ మోనోషాక్ ఉంది. వెనకవైపు రెండు షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి.

తాజాగా స్కూటర్లకు ఉంటున్న అన్ని ఫీచర్లూ దీనిలో ఉండేలా సుజుకీ జాగ్రత్త పడింది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్, యూఎస్‌బీ(USB) ఛార్జర్, ఫుల్-LED హెడ్ లైట్, డిజిటల్ అండర్ సీట్ స్టోరేజ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. కంపెనీ ఈ స్కూటర్ పవర్ ఎంత అన్నది బయటకి ఇంకా చెప్పకపోయినా బీఎస్6 ప్రమాణాలతో ఉన్న 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ టైప్ అని స్పష్టం చేసింది. ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 90 కిలోమీటర్ల దాకా వెళ్లనున్నట్లు సమాచారం. సిటీలో ఆఫీస్ పనుల కోసం, రోజు తక్కువ దూరం వెళ్లేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి మల్టీ ఫంక్షన్ ఫుల్ డిజిటల్ మీటర్ ఉంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here