నరేంద్ర మోదీ పిలుపుతో టాటా గ్రూప్ సంచలన నిర్ణయం

0

TATA Group: మన దేశంలో చాలా వరకు ప్రైవేట్ కంపెనీలకు సమాజం పట్ల సేవా భావం ఉండదనీ, అన్నీ వ్యాపార కోణంలోనే ఆలోచిస్తారనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు మాత్రం వ్యాపారంతో పాటూ తమ వంతు సహాయాన్ని సమాజానికి అందిస్తాయి. అలాంటి వాటిలో టాటా గ్రూప్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. నిన్న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని టాటా కంపెనీ సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని ప్రసంగాన్ని మెచ్చుకుంటేనే.. “కరోనాపై జరుగుతున్న ఈ పోరాటంలో మేము మా వంతు కృషి చేస్తాం” అని కంపెనీ ప్రకటించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడటంతో ఆ సమస్యపై టాటా గ్రూప్ స్పందించింది. తాము హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బూస్ట్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. టాటా గ్రూప్ 24 క్రయోజెనిక్ కంటైనర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటునట్లు తెలిపింది. ఈ కంటైనర్లలో లిక్విడ్ ఆక్సిజన్‌ను రవాణా చెయ్యవచ్చు. తద్వారా కొంతైనా దేశంలోని ఆక్సిజన్ కొరత సమస్య తీరుతుందని టాటా గ్రూప్ వెల్లడించింది. ఇప్పుడున్న కఠిన పరిస్థితుల్లో ఇది గొప్ప నిర్ణయమే అనుకోవచ్చు. ఎందుకంటే… ఆ క్రయోజెనిక్ కంటైనర్లు చాలా పెద్దగా ఉంటాయి. దీంతో ఎంతో మందికి ప్రాణం కాపాడటానికి వీలవుతుంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here