దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సరికొత్త రికార్డుకు చేరువలో ఉంది. రానున్న మూడు నెలల కాలంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలను దాటే అవకాశం ఉంది. దేశంలో ఈ ఘనత సాధించనున్న తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలవనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యే నాటికి ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,88,649. గత ఏడాది మొత్తంగా 40,185 మంది ఉద్యోగులు కొత్తగా చేరారు. 2021 జనవరి-మార్చి త్రైమాసికంలోనే 19,388 మంది ఉద్యోగుల్ని తీసుకుంది. ఒక త్రైమాసికంలో ఇంత అధికంగా ఉద్యోగుల నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి.
కంపెనీ నుంచి వలసలు కూడా జీవనకాల కనిష్ఠ స్థాయి అయిన 7.2 శాతానికి చేరాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అంతే స్థాయిలోనే 40,000 మందిని కొత్తగా నియమించుకుంటామని యాజమాన్యం ఇటీవల వెల్లడించింది. అంతర్జాతీయంగా పరంగా చూస్తే ఐటీ పరంగా అసెంచర్‌కు 5.37 లక్షల మంది ఉద్యోగులు ఉన్నందున, 5 లక్షల మందితో టీసీఎస్ రెండో స్థానానికి చేరే అవకాశం కనిపిస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌లో 3 లక్షలు, విప్రోలో 1.9 లక్షలు, హెచ్‌సీఎల్ టెక్‌లో 1.6 లక్షల మంది పని చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో భారతీయ రైల్వేలో 10 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే టీసీఎస్ రెండో స్థానంలో ఉంటుంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.