షాకింగ్: వారం రోజుల్లో 84 లక్షలు సంపాదించిన టెక్ డిజైనర్

0

యాపిల్ తన వినియోగదారులకు ఐఓస్‌ 14తో హోమ్ స్క్రీన్‌లను కస్టమైజ్‌ చేసుకునే సదుపా యాన్ని కల్పించింది. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన కస్టమ్ ఐకాన్ ప్యాక్ లను ఇన్ స్టాల్ చేసుకొని ఫోన్ మార్చుకోవచ్చు. ఆపిల్ యొక్క తాజా iOS అప్‌డేట్ విడుదలైన తరువాత, ఐఫోన్ లవర్స్ వారి హోమ్ స్క్రీన్‌లను మార్చి స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో పెడుతు న్నారు. ఈ ట్రెండ్‌ కస్టమ్‌ యాప్‌ ఐకాన్స్‌ తయారు చేసే ఓ డిజైనర్‌కు ఈ సదుపాయం వల్ల లక్షలు సంపాదించే అవకాశం లభించింది. దీనితో అతను ఒక వారంలోనే 1,15,000 డాలర్లు(రూ. 84 లక్షలు) సంపాదించాడు ఎవరు దీనిని ఊహించలేదు.(చదవండి: గేమింగ్ లవర్స్ కోసం స్మార్ట్ ఫోన్ ని తీసుకొస్తున్న క్వాల్‌కమ్)   

శాన్‌ఫ్రాన్సిస్‌కోకు చెందిన ట్రాఫ్ అని పిలువబడే ఈ వ్యక్తి 2013 నుండి కస్టమ్ యాప్ లకు చిహ్నాలు తయారుచేసే డిజైనర్‌గా పని చేస్తున్నాడు. పలువురు యూజర్లు iOS 14 హోమ్ స్క్రీన్‌లను నూతనంగా మార్చి సోషల్ మీడియాలో పెడుతుండటంతో తనకి ఒక ఐడియా వచ్చింది. దీంతో ట్రాఫ్ కొన్ని యాప్ ఐకాన్లు, విడ్జెట్లు తయారు చేసి తన బ్లాగ్ లో, సోషల్ అకౌంట్ లో షేర్ చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు తన ఐకాన్ ప్యాక్ ను తెగ ఇష్టపడ్డారు. దీనితో తన ఐకాన్ ప్యాక్ ను  కొన్ని ఆన్‌లైన్‌ విక్రయ సైట్లలో అందుబాటులో ఉంచారు. దీని ద్వారా అతనికి $ 17 (రూ. 1249 రూపాయలు) సంపాదించాడు.

తర్వాత, 120 ఐకాన్స్‌తో కూడిన ప్యాక్‌ను తయారుచేసి 28డాలర్లకు అమ్మడం మొదలుపెట్టాడు. దీనికి విపరీతమైన డిమాండ్ రావడంతో రెండు రోజుల్లోనే 6,000 డాలర్లు సంపాదించాడు. తన లక్ బాగుండీ ప్రముఖ టెక్ యూట్యూబర్ మార్క్యూస్ బ్రౌన్‌లీ తన యూట్యూబ్ వీడియోలో ఈ ప్యాక్ గురుంచి చెప్పడంతో ట్రాఫిక్ చాలా భాగా పెరిగింది. తర్వాత సుమారు 4,188 మంది వినియోగదారుల నుండి $116,147 సంపదించాడు. సరైన టైమ్ లో సరైన విషయాన్ని పోస్ట్ చేస్తే ఫలితలు ఇలా ఉంటాయని తెలిపాడు. కానీ, ఇది ఒక్క రోజులో వచ్చిన విజయం కాదని గత ఏడు సంవత్సరాలుగా వీటిని తయారు చేస్తున్నని ట్రాఫ్‌ పేర్కొన్నాడు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here