Saturday, November 23, 2024
HomeTechnologyTips & TricksSmart TV Buying Guide Tips: స్మార్ట్‌టీవీ కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!

Smart TV Buying Guide Tips: స్మార్ట్‌టీవీ కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!

Smart TV Buying Guide Tips in Telugu: త్వరలో రాబోయే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ డీల్‌లో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని మీరు చూస్తున్నారా.. అయితే, మీరు మనం చెప్పుకోబోయే విషయాలను టీవీ కొనేటప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకోండి. వీటిని తెలుసుకోవడం ద్వారా తక్కువ ధరలో మంచి స్మార్ట్ టీవి సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ టీవీ కొనేముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 అంశాలు:

స్మార్ట్‌టీవీ కొనేముందు ప్రతి ఒక్కరూ కింద పేర్కొన్న 5 అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

  • స్క్రీన్ సైజ్ (Screen Size)
  • డిస్‌ప్లే (Display)
  • కనెక్టివిటీ (Connectivity)
  • సౌండ్ (Sound)
  • ధర (Price)

స్క్రీన్ సైజ్(Screen Size):

ఏదైనా ఒక స్మార్ట్ టీవీ కొనేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలలో స్క్రీన్ సైజ్ ఒకటి. మనం ఇంట్లో కూర్చొని టీవి చూసేటప్పుడు టీవికి, మనకు మధ్య ఉండే దూరాన్ని బట్టి స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

(ఇది కూడా చదవండి: Mobile Buying Guide in Telugu: కొత్త మొబైల్ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!)

ఉదా: మనకు, స్మార్ట్ టీవీకి మధ్య దూరం 10 Feet కంటే ఎక్కువగా ఉంటే 50 – 65 inches టీవీ తీసుకోవడం మంచిది. క్రింద ఉన్న ఫోటోను బట్టి మీకు ఎంత సైజ్ టీవీ కావాలో మీరే తెలుసుకోవచ్చు.

- Advertisement -

డిస్‌ప్లే (Display):

ఏదైనా ఒక స్మార్ట్ టీవీ కొనేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలలో డిస్‌ప్లే కూడా మరొక ప్రధాన అంశం. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మళ్ళీ ఇందులో 3 అంశాల గురుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది.

డిస్‌ప్లే రకం (Display Type): మీకు LED, QLED, OLED అనే డిస్‌ప్లే రకాలు ఉంటాయి. ఇందులో OLED అనేది అన్నిటికంటే మంచి దృశ్యా అనుభూతుని కలిగిస్తుంది. ఆ తర్వాత స్థానంలో QLED ఉంటే, చివరగా LED ఉంటుంది.
రెజల్యూషన్ (Resolution): ఇక రెజల్యూషన్ విషయానికి వస్తే 4K సపోర్ట్ చేసే టీవీలు మంచి సినిమా అనుభూతిని కలిగిస్తాయి.
రిఫ్రెష్ రేట్ (Refresh Rate): మన టీవీలో ఎంత రిఫ్రెష్ రేట్ ఎక్కువగా ఉంటే అంత క్లారిటీగా మీకు బొమ్మ కనిపిస్తుంది. ఉదా: 60Hz రిఫ్రెష్ రేటుతో పోలిస్తే 120Hz రిఫ్రెష్ రేటు గల టీవీలో వీడియో అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది.

కనెక్టివిటీ (Connectivity):

మీ స్మార్ట్ టీవీలో USB, HDMI, Audio, RCA, LAN వంటి పోర్ట్స్ ఉండే విధంగా తప్పకుండా చూసుకోండి.

సౌండ్ (Sound):

ఇక సౌండ్ విషయానికి వస్తే.. మీరు కొనే స్మార్ట్ టీవీలో Dolby Digital, DTS Premium, Harman Kardonకి సపోర్ట్ చేసే విధంగా చూసుకోండి.

ధర (Price):

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ధర.. టీవీ కొనాలనే ఆలోచన వచ్చినప్పుడే మనకు ఎలాంటి టీవీ కావాలి.. దానికి ఎంత బడ్జెట్ ముందుగా తెలుసుకోవాలి. ఎలాంటి ప్లానింగ్ లేకుండా కొంటే మనం చిన్న చిన్న ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో రూ. 15 వేల నుంచి రూ. 1 లక్ష వరకు స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి.

(ఇది కూడా చదవండి: స్మార్ట్‌వాచ్‌లు కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles