తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రేపటి(మే 15) నుంచి మే 25 వరకు రైతుల ఖాతాలో రైతుబందు నగదు జమ చేయనున్నారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హత సాధించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఏడాది యాసంగితో పోలిస్తే ఈ ఏడాది 2.81లక్షల మంది రైతులు పెరిగారని నూతనంగా 66,311ఎకరాలు ఈ పథకంలో చేరినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన 63,25,695 మంది రైతుల(150.18లక్షల ఎకరాలు) ఖాతాలో 7508.78 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
కొత్తగా పేరు నమోదు చేసుకోవాలన్న రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలి. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిన రైతులు ఆందోళన చెందవద్దని ఏమైనా అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని తెలిపింది. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గానూ రూ.14,656.02 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్లో రూ.14,800 కోట్లు కేటాయించింది.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.