తెలంగాణలో తమ ఆస్తుల నమోదు కోసం గత నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్న చాలా మందికి ఉపశమనం కలిగించే విధంగా ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేసుకోవడానికి రాష్ట్ర హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ రోజు విచారణకు వచ్చిన పిటిషన్‌లో, ఆన్‌లైన్ బుకింగ్‌తో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని, వినియోగదారులకు స్లాట్లు అందించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
(చదవండి: మరో భారీ ప్రాజెక్ట్ కు మోదీ కేబినెట్ ఆమోదం)
రిజిస్ట్రేషన్‌లో భాగంగా ఆస్తిపన్ను వివరాలు, గుర్తింపు సంఖ్యను నమోదు చేయాలన్న షరతుకు కూడా హైకోర్టు అంగీకరించింది. భూమి మరియు వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలలో 100 శాతం పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చింది.
వ్యవసాయేతర ఆస్తులు, వ్యవసాయ భూముల నమోదు కోసం ప్రభుత్వం అంతకుముందు సెప్టెంబర్ 8న ధరణి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసింది. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎప్పుడూ స్టే ఇవ్వలేదని విచారణ సందర్భంగా మరోసారి న్యాయస్థానం స్పష్టం చేసింది.
అలాగే ధరణిపై ఇవాళ మరో ఐదు అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు విచారణను ఈ నెల 16కు హైకోర్టు వాయిదా వేసింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.