ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ తేదీ ఖరారు

0

ఆంధ్రప్రదేశ్‌లో పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. డిసెంబర్‌ 25న అర్హులకు డి-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వ‌ర‌కు 30,68,281మంది లబ్ధిదారులను ప్ర‌భుత్వం గుర్తించింది. వీరందరికి పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మొదలుకానున్నాయి. తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వాస్తవానికి జూలై 8న దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజున‌ ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొందరు కోర్టుకు వెళ్లడంతో పలుమార్లు వాయిదా పడింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్ర‌జ‌ల ఆకాంక్ష తొంద‌ర‌లోనే నెర‌వేరనుంది. ఇల్లు లేదనే వారు ఉండకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here