ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తు గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

0

అక్రమ లేఔట్లు, అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్ ఆర్ ఎస్) దరఖాస్తు గడువును నెల చివరి వరకు పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తొలుత విధించిన గడువు గురువారం నాటికి ముగిసింది. దీనితో ధరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రతిక ప్రకటన విడుదల చేశారు.రెండు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయం, ఇంటర్‌నెట్ కనెక్టివిటీ అవాంతరాల వల్ల ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here