శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

2020 మొదటి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో టాప్ – 5లో నిలిచిన కంపెనీలు ఇవే!

గత ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది(2020 Q1) కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో 11.9% క్షీణత కనిపించింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా 275.1 మిలియన్ స్మార్ట్ ఫోన్ లను అమ్మారు. గత ఏడాది 2019 మొదటి త్రైమాసికంలో 312.3 మిలియన్ స్మార్ట్ ఫోన్ లను అమ్మకాలు జరిపారు.

భౌగోళికంగా పరశీలిస్తే 2020 మొదటి త్రైమాసికం అమ్మకాల క్షీణతలో ఎక్కువగా చైనాలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే 20.3% స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో 1/4 వంతు చైనా నుండి జరగుతాయి.. దీని కారణంగా దీని యొక్క ప్రభావం ప్రపంచ మార్కెట్ మొత్తంపై పడింది. ఇకా ఈ క్షీణత యునైటెడ్ స్టేట్స్ మరియు పశ్చిమ ఐరోపాలలో వరుసగా 16.1% మరియు 18.3% తగ్గాయి. ఈ కరోనా కాలంలో చాలా మంది వారి యొక్క ఖర్చును తగ్గించుకోవడంతో అన్నీ ఫోన్ల అమ్మకాలలో క్షీణత కనబడింది.

Samsung:
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి స్యామ్సంగ్ అమ్మకాలలో 18.7% క్షీణత కనిపంచిన ప్పటికి, ప్రపంచ వ్యాప్త స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో 21.2%(51.2 మిలియన్ ఫోన్) శాతంతో ఈ మళ్ళీ తన మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. స్యామ్సంగ్ లోని A సిరీస్ ఫోన్లు అమ్మకాలలో మంచి పని తీరును కనబరిచాయి. అయితే స్యామ్సంగ్ ప్రీమియం 5G ఫ్లాగ్ షిప్ ఫోన్ అయిన గెలాక్సీ ఎస్ 20 లాంచ్ ఈ కరోనా కాలంలో అమ్మకాలను పెంచుకోవడానికి చాలా భాగా ఉపయోగ పడ్డాయి.

Huawei:
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి హువావే అమ్మకాలలో 17.1 % క్షీణత కనిపంచిన ప్పటికి, ప్రపంచ వ్యాప్త స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో 17.8% వాటాతో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికా హువావేపై వాణిజ్య నిషేదం విధించడం మరియు గూగుల్ తన మొబైల్ సర్వీస్ ను నిలిపివేయడంతో కొంచం తన ఫోన్ల అమ్మకాలలో క్షీణతకు కారణం కూడా అయింది. హువావే కు చెందిన యొక్క మేట్ 30 మరియు పి 30 సిరీస్‌లపై మరియు హానర్స్ వి 30 మరియు 9 ఎక్స్ సిరీస్‌ లు కొంత క్షీణతను తగ్గించాయి.

Apple:
ఆపిల్ 36.7 మిలియన్ ఐఫోన్‌ల అమ్మకాలతో 13.3% వాటాతో మూడవ స్థానంలో నిలిచింది మరియు 2020 మొదటి త్రైమాసికంలో 0.3% స్వల్పంగా క్షీణించింది. ఐఫోన్ 11 సిరీస్ అమ్మకాలలో వృద్ధిని పెంచడంలో సహాయపడింది. తక్కువ – ధర విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల విడుదల చేసిన SE (2020) మొబైల్ ఐఫోన్ అమ్మకాలకు బాగా దోహద పడ్డాయి.

Xiaomi:
షియోమి ఈ సారి (10.7%) నాల్గవ స్థానంలో నిలిచింది మరియు మొదటిసారిగా ప్రపంచ వ్యాప్త అమ్మకాలలో 10 మార్కెట్ వాటాను అధిగమించింది. షియోమి ఈ సంవత్సరంలో సంవత్సరానికి 6.0% వృద్ధిని సాధించింది. భారతదేశంలో, పూర్తి లాక్డౌన్ ప్రారంభించటానికి ముందే కంపెనీ కొత్త పోకో ఫోన్ మరియు రెడ్మి ఉత్పత్తులను విడుదల చేయడంతో.. 2020 మొదటి త్రైమాసికం అమ్మకాలలో ఆ ఉత్పత్తులు భాగా సహకరించాయి.

Vivo:
వివో 2020 మొదటి త్రైమాసికంలో 9.0% మార్కెట్ వాటాతో మరియు 7.1% సంవత్సరానికి పైగా వృద్ధితో టాప్ 5లోకి తిరిగి వచ్చింది. ఇది టాప్ 5 విక్రేతలలో అతిపెద్ద వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. ఇది ప్రధానంగా వివో యొక్క తక్కువ మరియు మధ్య-శ్రేణి Y మొబైల్ మరియు S మొబైల్ సిరీస్ భారతదేశంలో విజయవంతం అయ్యాయి. ఏదేమైనా, భారతదేశంలో పూర్తి లాక్డౌన్ కారణంగా, వివో తన ఉత్పత్తి అమ్మకాలలో చాలా సమస్యలను ఎదురుకొన్నది.

(Source: IDC)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu