ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగ్ ఇదే.. ఎందుకో తెలుసా?

0

ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ అయిన బోరిని మిలానేసి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ను విడుదల చేసింది, దీని ధర 52 కోట్ల రూపాయలు. బోలోగ్నా బ్రాండ్ కేవలం మూడు విలాసవంతమైన పర్వా మీ బ్యాగ్‌లను ఉత్పత్తి చేసినట్లు పేర్కొంది. ప్రతి బ్యాగ్‌ను తయారు చేయడానికి 1,000 గంటలపైగా సమయం పట్టిందని సమాచారం.(చదవండి: పింఛన్‌దారులకు ఈపీఎఫ్‌వో శుభవార్త!)

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగ్ ను తయారు చేసినందుకు మాకు గర్వకారణం అని కంపెనీ తెలిపింది. ఖరీదైన నీలాలు, వజ్రాలు పొందుపరిన ఈ బ్యాంగ్, సముద్ర కాలుష్యంపై అవగాహన పెంచడానికి డిజైన్ చేసినట్టు సంస్థ తెలిపింది. వీటని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయంలో 800 వేల యూరోలు సముద్రాలను శుభ్రపరచడానికి విరాళంగా ఇవ్వబడతాయి అని ఇటాలియన్ బ్రాండ్ తెలిపింది. సెమీ-మెరిసే ఎలిగేటర్ చర్మంతో తయారు చేయబడిన ఈ బ్యాగ్ పై తెల్ల బంగారంతో చేసిన 10 సీతాకోక చిలుకలుండగా, వీటిలో 4 సీతాకోక చిలుకలపై ఖరీదైన మేలురకం వజ్ర వైఢూర్యాలున్నాయి.

బ్యాగ్ యొక్క రూపకల్పన కోసం 130 క్యారెట్ల వజ్ర వైఢూర్యాలు, అరుదైన మరకత మాణిక్యాలు దీనిపై పొదిగారు. అంతేకాదు వైట్ గోల్డ్ తో క్యూట్ గా కనిపించే బటర్ ఫ్లైలు తయారు చేసి బ్యాగ్ పై నాజూగ్గా అమర్చారు. ఈ బ్యాగ్ తన తండ్రికి నివాళి అని పేర్కొన్నట్లు బోరిని మిలానేసి సహ వ్యవస్థాపకుడు మాటియో రోడాల్ఫో మిలనేసి పేర్కొన్నారు. ఇంతలో, బ్యాగ్ యొక్క డిజైనర్ కరోలినా బోరిని మాట్లాడుతూ.. “నీలం నీలమణి మహాసముద్రాల లోతులని సూచిస్తుంది అని పేర్కొంది. బోరిని మిలానేసి ఇటలీలో 2016 లో స్థాపించబడింది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం, ప్రస్తుత అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ గుండె ఆకారంలో ఉన్న మౌవాడ్ 1001 నైట్స్ డైమండ్ పర్స్, ఇది 18 కిలోల బంగారంతో తయారు చేయబడింది మరియు 4,517 వజ్రాలతో కప్పబడి ఉంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here