వైరల్: అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఒక సూపర్‌ విలన్‌

0

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తన తొలి అంతరిక్షయాత్ర కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అమెజాన్‌ కు చెందిన బ్లూ ఆరిజిన్‌ కంపెనీ తన తొలి మానవసహిత అంతరిక్షయాత్రను జూలై 20న ప్రయోగించనుంది. ఈ ప్రయోగంలో జెఫ్‌ బెజోస్‌ తన సోదరుడి మార్క్‌ బెజోస్‌, మరో వ్యక్తి న్యూషెపార్డ్‌ అంతరిక్షనౌకతో కలిసి ప్రయాణించనున్నారు. జెఫ్‌ బెజోస్‌ తో కలిసి పది నిమిషాల ప్రయాణానికి మరో వ్యక్తి సుమారు రూ.280 కోట్ల మేర బిడ్‌ చేశాడు. జెఫ్‌ బెజోస్‌ తన తొలి అంతరిక్షయాత్ర కోసం సిద్దమవుతుంటే కొంతమంది నెటిజన్లు మాత్రం అతనిపై విరుచుకుపడుతున్నారు.

బెజోస్‌ను తిరిగి భూమిపైకి రానివ్వదంటూ ఆన్‌లైన్‌లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫ్‌ బెజోస్‌ మారువేశంలో ఉన్న సూపర్‌ విలన్‌ అని, అతడు ప్రపంచాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే సరైనా సమయం జెఫ్‌ బెజోస్‌ను తిరిగి భూమిపైకి రానివ్వకుండా ఉంటే మానవాళి పెను ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చునని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌కు సుమారు వారం వ్యవధిలోనే 6781 మం‍ది మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.(ఇది కూడా చదవండి: ఎయిర్‌టెల్ 5జీ ఇంటర్నెట్ వేగం ఎంతో తెలుసా?)

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here