మీరు టీఎస్ ఆర్టీసీలో పని చేస్తున్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. టీఎస్ ఆర్టీసీలో పని చేసే సుదీర్ఘ సెలవు పెట్టాలనుకునే డ్రైవర్, కండక్టర్లకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వీరికి ‘అసాధారణ సెలవు’ విధానం వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మీరు ఏదైనా కారణంతో విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉందా.. అయితే దరఖాస్తు చేసుకోండి.. ‘అసాధారణ సెలవు’ ఇచ్చేస్తామంటూ డిపో మేనేజర్లు డ్రైవర్, కండక్టర్లకు సూచిస్తున్నారు. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్(ఈఓఎల్)’కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.(చదవండి: పెట్రోల్, డీజిల్ పెంపుపై 9 నెలల్లో కేంద్రం చెప్పిన 10 వింతైన కారణాలు..!)
రెండేళ్ల క్రితం ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ 1,300 అద్దె బస్సులను అదనంగా తీసుకుంది. వాటిల్లో అద్దె బస్సు యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసినందున అంతమేర సంస్థ డ్రైవర్లు ఇప్పుడు మిగిలిపోయారు. ఆ వెంటనే వేయి బస్సులను ఆర్టీసీ తగ్గించుకోవటంతో మళ్లీ డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయారు. ఇలా ప్రస్తుతం సంస్థలో మొత్తం దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయారు. వీరికి పని లేకపోయినా జీతం చెల్లించాల్సిందే. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి, మిగులు ఉద్యోగుల నేపథ్యంలో ఆర్టీసీకి ఈ అసాధారణ సెలవు గుర్తొచ్చింది.

ఇలా సిబ్బంది మిగిలిపోతే ఈ సెలవు ఇవ్వచ్చని ఆర్టీసీ విధివిధానాల్లో ఉంది. గతంలో అమలు చేశారు కూడా. తర్వాత డ్రైవర్, కండక్టర్ల కొరత దృష్ట్యా దీన్ని నిలిపేశారు. అలాగే, 5 ఏళ్ల తర్వాత వారికి ఇష్టం ఉంటే తిరిగి సంస్థలో చేరవచ్చు. వారికి ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది. అందుకే, భారీ సంఖ్యలో సిబ్బంది ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్(ఈఓఎల్)’కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో వచ్చే తక్కువ జీతంతో పని చేసే కంటే బయట పని చేసుకోవచ్చు అని దరఖాస్తు చేసుకుంటున్నారు.(చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు శుభవార్త.. ఛార్జింగ్ కష్టాలకు చెక్!)
ఫిర్యాదులు నాకు చెప్పండి: సజ్జనార్
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న సజ్జనార్.. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. md@tsrtc.telangana.gov.in మెయిల్ ఐడీని వెల్లడించారు. @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతాను కూడా అనుసరించాల్సిందిగా కోరారు.