TVS X Electric Scooter: అదిరిపోయిన టీవీఎస్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?

0
TVS X Electric Scooter Launched in India
TVS X Electric Scooter Launched in India: Check Price Details Inside

TVS X Electric Scooter Price in India: ప్రముఖ ఆటో మోబైల్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దుబాయ్ నుంచి లైవ్ ఈవెంట్ ద్వారా విడుదల చేసింది. ఇది ప్రీమియం కేటగిరీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా అధునాతన ఫీచర్లు, టెక్నాలజీతో వస్తుంది.

ఎక్స్ఎల్ఈటీఓఎన్ ప్లాట్ ఫామ్

టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తన కొత్త ఎక్స్ఎల్ఈటీఓఎన్ ప్లాట్ ఫామ్’పై నిర్మించారు. టీవీఎస్ ఎక్స్ స్కూటర్‌ను అల్యూమినియం అల్లాయ్’తో రూపొందించిన కొత్త ఎక్స్ లెటన్ ఫ్రేమ్ ఆధారంగా రూపొందించారు.

టీవీఎస్ ఎక్స్ ఛార్జింగ్-టైమ్

టీవీఎస్ ఎక్స్(TVS X) ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని 950 వాట్ ఛార్జర్ సహాయంతో 3 గంటల 40 నిమిషాల్లో 0-80% ఛార్జింగ్ చేయవచ్చు.

టీవీఎస్ ఎక్స్ రేంజ్, వేగం

టీవీఎస్ ఎక్స్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. దీని పీక్ పవర్ వచ్చేసి 11 kWగా ఉంది. ఈ స్కూటర్ 2.6 సేకన్లలో 40 KMPH వేగాన్ని అందుకుంటుంది.

డిజిటల్ ఫీచర్లు

టీవీఎస్ ఉత్తమ ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో ఎయిర్ కూలింగ్ టెక్నాలజీని కూడా ఉంది. టీవీఎస్ ఎక్స్ స్కూటర్‌లో ఇండస్ట్రీ-ఫస్ట్ లైవ్ వెహికల్ లొకేషన్ షేరింగ్ ఫీచర్ ఉందని టీవీఎస్ పేర్కొంది. టీవీఎస్ ఎక్స్ నావ్ ప్రో అనే సరికొత్త ఆన్ బోర్డ్ నావిగేషన్ సిస్టమ్ కలిగి ఉండి. 10.25 అంగుళాల అతిపెద్ద డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.

(ఇది కూడా చదవండి: రూ.లక్ష కన్నా తక్కువకే లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!)

ఇందులో ఎక్స్ థియోల్త్, ఎక్స్ స్ట్రైడ్, క్సోనిక్ అనే మూడు మోడ్స్ ఉండనున్నాయి. క్సోనిక్ అత్యంత శక్తివంతమైన రైడ్ మోడ్. ఇందులో ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ వెనుక భాగంలో చాలా స్పోర్టీ లుక్ ఆఫ్సెట్ మోనో సస్పెన్షన్తో వస్తుంది.

బుకింగ్, డెలివరీ

టీవీఎస్ ఎక్స్ బుకింగ్స్ ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభమైతే, డెలివరీలు డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. రూ.5000 బుకింగ్’తో టీవీఎస్ ఎక్స్ బుక్ చేసుకోవచ్చు.

టీవీఎస్ ఎక్స్ ధర:

టీవీఎస్ ఎక్స్ ధర రూ.2.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). భారతదేశంలో అమ్మకాని వచ్చిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. టీవీఎస్ ఎక్స్ స్కూటర్‌ను కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ లభించదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here