కొత్త బైక్ కొన్నవారికి ఉచితంగా రెండూ హెల్మెట్లు

0

మీరు ఈ మధ్య కాలంలో కొత్త బైక్ కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. మీరు ఏ షో రూమ్ దగ్గర బైక్ కొన్నారో ఆ షో రూమ్ కి బైక్ తయారీ కంపెనీలు ప్రతి బైక్/ స్కూటర్ కొనేవారికి ఇవ్వాలని అందజేస్తుంది. ఇటీవల రెండూ తెలుగు రాష్ట్రాలు ప్రతి బైక్/స్కూటర్ రైడర్ కచ్చితంగా హెల్మెట్ ధరించాలని పేర్కొంటున్నాయి. అలాగే, ప్రతి వ్యక్తి కచ్చితంగా సెంట్రల్ మోటార్ వెహికల్స్ 1989 యాక్ట్ నిబందనలను కచ్చితంగా పాటించాలని పేర్కొంటున్నాయి. ఈ నిబందనలకు సంబంధించి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

ఉచితంగా రెండూ హెల్మెట్లు

సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్ ,1989 యాక్ట్ రూల్ నెంబర్ 138(4)(ఎఫ్) ప్రకారం.. ద్విచక్ర వాహనాల కొనుగోలు సమయంలో సంబంధిత తయారీదారుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టం కింద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న హెల్మెట్ హెడ్ గేర్ అందించాల్సి ఉంటుంది. కంపెనీలు వినియోగదారులకు బిఎస్ఐ ప్రమాణాలు పాటించే/అందుకునే రెండు హెల్మెట్లను అందించాలనే నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సియామ్)తో పాటు ద్విచక్ర వాహనాల తయారీదారులకు సమాచారం పంపాలని కోర్టు గతంలో ఆదేశించింది.

హెల్మెట్ ఇవ్వకపోతే అమ్మకాలు నిషేదం

అంతేగాక, బీఎస్ఐ ప్రమాణాల ప్రకారం సూచించిన ఐఎస్ఐ హెల్మెట్లను తయారీదారుడు సరఫరా చేయాలని, అలా చేయకపోతే మహారాష్ట్ర మొత్తం రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధించాలని కోర్టు రవాణా కమిషనర్ కు ఆదేశించింది. రైడర్ & పైలాన్ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై ఉన్నప్పుడు సరైన హెడ్ గేర్ లేదా హెల్మెట్ ధరించాలని గుర్తుంచుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here