సైకిల్‌ మీద ఉబెర్‌ సీఈఓ ఫుడ్‌ డెలివరీ.. సంపాదన ఎంతంటే?

0

వృత్తిలో నైతిక విలువలు, పనిలో కష్టపడేతత్వం, సాటి మనుషుల పట్ల కరుణ.. వీటికి తోడు అదృష్టం మనిషిని సమాజంలో సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌గా నిలబెడతాయి. ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రస్తుత ఉబెర్‌ సీఈఓ దారా ఖోస్రోషాహికి తనకు చేసే పని మీద శ్రద్ద ఎక్కవ. అందుకే అప్పుడప్పుడు గ్రౌండ్‌ స్థాయిలోకి వెళ్లి.. తన తోటి ఉద్యోగులు, వర్కర్ల పనితీరును పర్యవేక్షిస్తుంటాడు. సరదాగా వాళ్లతో అప్పుడప్పుడు ఔటింగ్‌లకూ వెళ్తుంటాడు. అలాంటి వ్యక్తి ఈ మధ్య ఆయన గ్రౌండ్ స్థాయికి వెళ్లి ఫుడ్‌ డెలివరీలు చేశాడు. అదీ సైకిల్‌ మీద వెళ్లి మరి కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేశాడు. ఆదివారం ఈ విషయాన్ని తనే స్వయాన ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు.

శాన్‌ ఫ్రాన్సిస్కోలో సైకిల్‌ మీద ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. పైగా డెలివరీల చేసినందుకు ఆరోజులో మొత్తం దాదాపు 100 డాలర్లు సంపాదించినట్లు వెల్లడించాడు. ఇక ఎలా సంపాదించారని కొందరు కామెంట్ చేస్తే.. ఒక్కో ఆర్డర్‌ మీద 6 నుంచి 23 డాలర్లు సంపాదించినట్లు చెప్పుకొచ్చాడు. మొత్తం పది ట్రిప్పులలో 98.91 డాలర్లు సంపాదించిన స్క్రీన్ షాట్ ఆయన షేర్‌ చేశాడు. మరికొందరు నెగెటివ్ గా కూడా కామెంట్ చేస్తున్నారు.
పబ్లిసిటీ స్టంట్‌ అదిరిందంటూ 52 ఏళ్ల దారా ఖోస్రోషాహిని కొందరు అపహేళన చేస్తున్నారు. ఇక ఇంకొందరు ఉబెర్‌ ఈట్స్‌ సర్వీసును పొగుడుతూనే.. డెలివరీ బాయ్స్ ను మనుషుల్లా చూడడం నేర్వండంటూ దారాకి చురకలంటించారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here